Saturday, November 23, 2024
Homeహెల్త్Foot care: పాదాల సౌందర్యానికి కొల్లాజెన్ సాక్సు

Foot care: పాదాల సౌందర్యానికి కొల్లాజెన్ సాక్సు

ఇటీవల కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరూ అందంగా కనపడాలని తపన పడడం చూస్తున్నాం. తమని తాము ప్రేమించుకోవడంతో పాటు తాము అందంగా, నిత్యయవ్వనులుగా కనిపించాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఈ ఆలోచనా ధోరణి చేసే మేలెంతో. ఎందుకంటే ఈ ధోరణి స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతోపాటు వారిని బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది కూడా. వీరిలో కనిపిస్తున్న ఈ ధోరణి కేవలం చర్మ సంరక్షణ, శరీర సౌందర్యం, శిరోజాల పరిరక్షణ, గ్రూమింగ్ లకు మాత్రమే పరిమితం కాలేదు. అందమైన పాదాల సంరక్షణ కూడా వీరి బ్యూటీ రిజీమ్ లో కొత్తగా వచ్చి చేరింది. స్త్రీలు అనుసరిస్తున్న సెల్ఫ్ కేర్ పద్ధతుల్లో పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడే కొల్లాజెన్ సాక్స్ వాడకం పెరిగింది. పాదాలు, చేతులు సుకుమారంగా, ఆరోగ్యంగా, మరింత అందంగా కనిపించేలా ఈ సాక్స్ చేస్తాయి.

- Advertisement -

ఈ సరికొత్త యాంటీ ఏజింగ్ బ్యూటీ ట్రెండుకి ఎంతో ఆదరణ వెల్లువెత్తుతోంది. ఈ సాక్స్ పాదాల, చేతుల చర్మాన్ని అందంగా కనిపించేలా చేయడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయంటున్నారు. వీటి వినియోగం వల్ల చర్మంపై ఎలాంటి దుష్పరిణామాలు సంభవించవని సౌందర్యనిపుణులు చెప్తున్నారు. పైగా పాదాల సంరక్షణకు ఇది ఎంతో సులువైన బ్యూటీ టెక్నిక్ అంటున్నారు. కాస్మొటిక్ రంగంలోని పలు బ్యూటీ ఉత్పత్తుల్లో కొల్లాజెన్ వాడడం చూస్తాం.ఈ కొల్లాజెన్ లో ప్రొటీన్లతో పాటు కావలసినన్ని మాయిశ్చరైజింగ్ సుగుణాలు కూడా ఉన్నాయి. కొల్లాజెన్ పాదాలను, వేళ్లను, వాటి కొసలను, గోళ్లను అందంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.

సౌందర్యవంతమైన చర్మంకోసం యాంటీ ఏజింగ్ పెప్టైడ్స్ అంటే కొల్లాజెన్ పెప్టైండ్స్ ద్వారా పట్టులాంటి చర్మం పొందవచ్చంటున్నారు. చర్మంపై వయసు ప్రభావం వేగంగా, మరింత లోతుగా ఉంటుంది. ఫలితంగా శరీరంలోని కొల్లాజెన్ దెబ్బతిని చర్మం ఎలాస్టిసిటీనీ కోల్పోతుంది. పొడారినట్టు అవుతుంది. చర్మం ముడతలు పడడంతో పాటు గీతలు కూడా ఏర్పడతాయి. ఈ కొల్లాజెన్ లో నాలుగు రకాలు ఉన్నాయి. స్ట్రక్చరల్ ప్రొటీన్ అయిన కొల్లాజెన్ టిష్యూల స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీతో పాటు అవి బలోపేతం అవడానికి కూడా తోడ్పడతాయి. రకరకాల మార్గాల నుంచి తీసిన కొల్లాజెన్ ప్రభావం శరీరం మీద వివిధ రకాలుగా ఉంటుంది. అలా సేకరించిన కొల్లాజెన్ పెప్టైడ్స్ స్కిన్ మీద బాగా పనిచేస్తాయి.

ఉదాహరణకు పశుసంబంధిత ఎముక నుంచి తీసిన కొల్లాజెన్ పెప్టైడ్స్ చర్మంలో కొల్లాజెన్ ను పెంచి చర్మం రిలాక్స్ అయ్యేలా సహాయపడుతుంది. అయితే స్కిన్ మాయిశ్చరైజింగ్ గుణంపై మాత్రం ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. బ్యూటీ కేర్ విషయానికి వస్తే సాధారణంగా పాదాల అందం, ఆరోగ్యాలను ప్రొఫెషనల్ పెడిక్యూరిస్టులు ట్రీట్ చేస్తుంటారు. కొత్త ఫుట్ కేర్ ట్రెండ్ అయిన ఈ కొల్లాజెన్ సాక్సులను ఒకసారి మాత్రమే వాడాలి. ఇవి పాదాలకు కావలసినంత హైడ్రేషన్ ను అందిస్తాయి. పాదాలను అందంగా, నాజూగ్గా కనిపించేలా చేస్తాయి. వారానికి ఒకసారి ఈ మేజికల్ కొల్లాజెన్ సాక్సులు వేసుకుంటే మీ పాదలు నునుపుగా, నాజూగ్గా తయారవుతాయి. పైగా ఇది ఎంతో సింపుల్ ప్రక్రియ కూడా. ఈ సింపుల్ టెక్నిక్ తో గరిష్ట స్థాయిలో క్లయింట్లు ప్రయోజనాలు పొందుతారు. వీటి వినియోగం కూడా చాలా సులువుగా ఉంటుంది. పాదాలపై దీని ఫలితాలు ఎంతో వేగంగా కనిపిస్తాయి.

కొల్లాజెన్ సాక్సును పాదాలకు వేసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. వీటి వల్ల పాదాలపై ఉన్న మ్రుత కణాలు పోతాయి. అలాగే పాదాల కింద భాగంలో ఏర్పడ్డ పగుళ్లను సైతం ఇవి పోగొడతాయి. కాలి గోళ్లకు కావలసినంత హైడ్రేషన్ ను అందిస్తాయి. సాంత్వనను ఇస్తాయి. సౌందర్యనిపుణులు, చర్మనిపుణుల సలహాతో అత్యాధునికమైన కొల్లాజెన్ సాక్సు ఫుట్ కేర్ ట్రెండును ఫాలో అవండి.. అందమైన పాదాలతో మీ రూపానికి మరింత వన్నె తెచ్చుకోండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News