ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమోర్ ఆసుపత్రి సహకారంతో అశోకా వన్ మాల్ ఫిబ్రవరి 3-5వ తేదీ వరకు ఉచిత ఆరోగ్య ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సందర్శకులకు కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్‌లను అందించడం ద్వారా ముందస్తుగా క్యాన్సర్‌ను గుర్తించడం, నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచేలా విజిటర్స్ లో అవగాహన కల్పించారు.
ఫ్రీగానే పలు వైద్య సేవలు
ఆరోగ్య శిబిరంలో సాధారణ వైద్యులు, నేత్రవైద్యులు, దంత నిపుణులతో సంప్రదింపులు, కంటి పరీక్షలు, రక్తపోటు, రక్త చక్కెర పరీక్షలతో సహా అనేక ఉచిత వైద్య సేవలను అందించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉచిత ఆరోగ్య ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోకా డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ, “అశోకా వన్ మాల్‌లో, ఆరోగ్య అవగాహన-నివారణ సంరక్షణను ప్రోత్సహించడం ద్వారా మా కమ్యూనిటీ శ్రేయస్సుకు దోహదపడుతుందని మేము నమ్ముతున్నాము. ఈ చొరవ, అమోర్ హాస్పిటల్‌తో కలిసి, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేపడుతోందని, ముందస్తుగా వ్యాధులను గుర్తించే ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాం” అన్నారు.