Sunday, November 16, 2025
Homeహెల్త్Medical Tests : అక్కడ రక్త పరీక్షలు ఉచితం.. మందులు సైతం ఇస్తారు!

Medical Tests : అక్కడ రక్త పరీక్షలు ఉచితం.. మందులు సైతం ఇస్తారు!

Free medical test in government hospitals: ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు సుమారు ఐదారు వందలు ఉంటుంది. చాలా సందర్భాలలో మందుల ఖర్చు సైతం వందల్లోనే ఉంటుంది. కానీ మెడికల్ టెస్టుల బిల్లు మాత్రం మాత్రం వాచిపోతాయి. డాక్టరు ఫీజు, మందులకు కలిపి వెయ్యి రూపాయలలోపు వెచ్చిస్తే.. వైద్య పరీక్షలకు మాత్రం వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ వ్యయం కూడా ఆసుపత్రి రేంజ్​ను బట్టి మారుతూ ఉంటుంది! అయితే మీకు ఓ విషయం చెప్పాల్సిందే. మెడికల్ టెస్టులు ఉచితంగా చేయించుకోవచ్చు. అయితే అది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? ఏమేం పరీక్షలు చేస్తారనే విషాలను సైతం తెలుసుకోవాలని ఉందా? అయితే ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

పట్టణాలు, నగర ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు విరివిగా ఉంటాయి. కానీ వాటి ముఖం చూడటానికి కూడా మనలో చాలా మంది ఇష్టపడరు. కానీ.. ప్రస్తుతం పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఇష్టపడాలి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో మెరుగైన సేవలను అందుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకునేకంటే.. ఇక్కడికి వెళ్లి ఉచితంగా పరీక్షలు చేయించుకోవడం మేలు. ఇంకా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు సైతం ఉండదు. మందులు సైతం ఇస్తారు.

Also Read:https://teluguprabha.net/health-fitness/delayed-sleep-phase-syndrome-youth-health-risks/

40 రకాల పరీక్షలు: గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకటీ అరా టెస్టులు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు చాలా ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో టెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్​లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 40 రకాల పరీక్షలు చేస్తున్నారు. పొద్దున 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు రక్త, మూత్ర మరియు ఇతర నమూనాలు తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని సర్కారు డయాగ్నస్టిక్‌ సెంటర్లకు తరలిస్తారు. పరీక్షలు పూర్తి అయ్యాక రిపోర్టులు మీ ఫోన్‌ నంబరుకు పంపిస్తారు. టెస్టును బట్టి ఫలితాలు రావడానికి ఒక్కోసారి 2 రోజుల సమయం పడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad