ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి… ఈరోజే ఫ్రీడమ్ 30 నిమిషాల మువ్మెంట్ (#freedom30minutemovement) తో ప్రారంభించండి.. అనే కొత్త ప్రచారాన్ని ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ప్రారంభించింది. చిన్న మార్పులతో మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రచారం ప్రారంభించబడింది. ఉద్యోగం, కెరీర్, ఇంటిపనులు, సంరక్షణలో మహిళలు తరచుగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ ప్రచారం ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు చేయడానికి ప్రోత్సహిస్తుంది.
భారతదేశంలో మహిళల ఆరోగ్యం పట్ల ది లాన్సెట్ రిపోర్ట్ (2022) ఆందోళనకరమైన ధోరణులను వెల్లడించింది. 60% మంది భారతీయ మహిళలు తగినంత శారీరక శ్రమ చేయడం లేదు, 10 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. గుండె జబ్బులు మహిళల్లో 300% పెరిగాయి. 57% మంది వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నారు. కనీసం 30 నిమిషాల నడక, యోగా, స్ట్రెచింగ్ లేదా ఇతర శారీరక శ్రమ చేయాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.
ఈ సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ #ఫ్రీడమ్ 30 నిమిషాల మువ్మెంట్ ను పరిచయం చేసింది. మహిళలు తమ రోజువారీ దినచర్యలో భాగంగా 30 నిమిషాల వ్యాయామం చేయాలని ఫ్రీడమ్ ప్రోత్సహిస్తుంది. ఫ్రీడమ్, మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలిని సులభంగా అవలంబించమని కోరుతోంది.
జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పి. చంద్ర శేఖర రెడ్డి మాట్లాడుతూ, కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి మహిళలు ఆందోళన పడతారు, అయితే వారు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. ఈ ప్రచారం మహిళలు తమ ఆరోగ్యంపై 30 నిమిషాలు గడపాలని ప్రోత్సహిస్తుంది. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్, ఆరోగ్యకరమైన వంట నూనెను అందించడం ద్వారా మహిళలకు మద్దతు ఇస్తుంది. మహిళలు తమ కుటుంబాలను ఎంతగా శ్రద్ధ వహిస్తారో, అంతే తమ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం #ఫ్రీడమ్ 30 నిమిషాల మువ్మెంట్ లో మాతో చేరండి” అన్నారు.
జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ శ్రీ చేతన్ పింపాల్ఖుటే మాట్లాడుతూ, లాన్సెట్ (2022) అధ్యయనం మహిళలకు ఒక పిలుపు అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడానికి #ఫ్రీడమ్ 30 నిమిషాల మువ్మెంట్ లో చేరండి” అన్నారు. మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని, ఆరోగ్యంగా తినటంతో పాటు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు.
ఈ ప్రచారం కేవలం అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు.. మహిళలు ఆరోగ్యకరమైన జీవితం వైపు చిన్న కానీ అర్థవంతమైన అడుగులు వేయడానికి ప్రోత్సహించే ఉద్యమం. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్, సమతుల్య జీవనశైలిని పూర్తి చేసే వంట నూనెను అందించడం ద్వారా ఈ ప్రయాణానికి మద్దతు ఇస్తుంది.