జుట్టు రేగకుండా…
- Advertisement -
నున్నని జుట్టు కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి:
అలొవిరా జెల్ లో సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. అందుకే అలొవిరా జెల్ ను జుట్టుకు రాసుకుంటే శిరోజాలు రేగిపోకుండా కుదురుగా ఉంటాయి.
కొద్దిగా బాదం నూనె తీసుకుని తలకు రాసుకుంటే జుట్టు రేగకుండా ఉంటుంది. అంతేకాదు బాదం నూనె శిరోజాలను పరిరక్షిస్తుంది. దీనివల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ ఎంతో అందంగా కనిపిస్తాయి.
అన్ని రకాల శిరోజాల సమస్యలకు ఆపిల్ సిడార్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. యాపిల్ సిడార్ వెనిగర్ లోని యాంటాక్సిడెంట్లు జుట్టు రేగకుండా కాపాడతాయి. కోడిగుడ్డులోని తెల్లసొనను వాడడం వల్ల జుట్టు మ్రుదువుగా మారుతుంది. పట్టులా మెరిసిపోతుంది. నిమ్మరసం కలిపి ఈ ప్యాక్ ను జుట్టుకు పట్టించుకుంటే మంచి ఫలితం.