Thursday, March 12, 2026
Homeహెల్త్Vitamin E Fruits: కేవలం న‌ట్స్‌, సీడ్స్‌లోనే కాదు..ఈ పండ్లలోనూ విట‌మిన్ ఇ ఉంటుంది..

Vitamin E Fruits: కేవలం న‌ట్స్‌, సీడ్స్‌లోనే కాదు..ఈ పండ్లలోనూ విట‌మిన్ ఇ ఉంటుంది..

Vitamin E Rich Fruits: శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ర‌కాల విట‌మిన్లలో విట‌మిన్ ఇ ఒక‌టి. ఇది మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. విట‌మిన్ ఇ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారించి, బలపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది. కాబట్టి, విట‌మిన్ ఇ ఉండే ఆహారాల‌ను డైట్ లో ఉండేలా చూసుకోవాలి. అయితే, విట‌మిన్ ఇ అన‌గానే కేవలం కొన్ని ర‌కాల న‌ట్స్‌, విత్త‌నాలు గుర్తుకు వ‌స్తాయి. కానీ, నిజానికి విట‌మిన్ ఇ ప‌లు ర‌కాల పండ్లు, ఇత‌ర కూర‌గాయ‌ల్లోనూ ఉంటుంది. ఈ క్రమంలో విటమిన్ E అధికంగా లభించే పండ్లు ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

also read:Milk: చల్లని పాలు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య లాభాలు..

విటమిన్ E అధికంగా లభించే పండ్లు ఇవే

  • కివి పండు
    కివిలో విటమిన్ E మాత్రమే కాకుండా విటమిన్ C కూడా ఉంటుంది. కివి తినడం శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.
  • మామిడి పండు
    అందరూ ఇష్టపడే వేసవి పండు అయినా మామిడి రుచికరంగా ఉండటమే కాకుండా మంచి మొత్తంలో విటమిన్ E ని కూడా కలిగి ఉంటుంది. ఇది చర్మం సమస్యలకు మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
  • బొప్పాయి పండు
    బొప్పాయిలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
  • అవకాడో
    అవోకాడోను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. ఇది గుండెను బలపరుస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.
  • జామ పండు
    జామకాయలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ కణాలను మరమ్మతు చేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • బ్లూబెర్రీస్
    బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ నిధి. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
  • బ్లాక్‌బెర్రీస్
    బ్లాక్‌బెర్రీస్‌లో విటమిన్ ఇ, ఫైబర్ రెండూ ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మాన్ని ముడతల నుండి రక్షిస్తాయి.
  • పచ్చి కొబ్బెర
    కొబ్బరి గుజ్జు, నీటిలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి సహజ తేమను అందిస్తుంది.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News