Fruits To Avoid In Winter: చలికాలం వస్తూనే అనేక ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. ఈ సీజన్‌లో శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వలన జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి పరిస్థితిలో చలికాలంలో మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు శరీరానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని కలిగిస్తాయి. అయితే పండ్ల విషయానికి వస్తే..వేసవిలో చాలా పండ్లు చల్లబరచడానికి, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కాగా, అదే చలికాలంలో కొన్ని పండ్లు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. పైగా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందువల్ల, చలికాలంలో ఏ పండ్లను తినకూడదో, ఏ పండ్లు శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతాయో తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు చలికాలంలో ఆరోగ్యానికి హాని కలిగించే పండ్ల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దోసకాయ, పుచ్చకాయ: వేసవిలో చల్లదనాన్ని అందించే దోసకాయ, పుచ్చకాయ చలికాలంలో తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ పండ్లు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఇది జలుబు, దగ్గును మరింత తీవ్రతరం చేస్తుంది. ఇప్పటికే జలుబు లేదా దగ్గుతో బాధపడుతుంటే ఈ పండ్లను తినకపోవడమే మంచిది.
also read:Soaked Peanuts: ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగలు తింటే ఈ అద్భుతమైన 7 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!
కొబ్బరి నీరు: కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, దాని చల్లని స్వభావం చలికాలంలో ఆరోగ్యానికి హానికరం కలిగిస్తుంది. కబ్బరినీరు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. దీంతో ఛాతీ బరువు, దగ్గు వస్తుంది.
ద్రాక్ష: ద్రాక్షలు రుచికరమైనప్పటికీ చలికాలంలో జాగ్రత్తగా తీసుకోవాలి. ద్రాక్ష చల్లని స్వభావం గొంతు నొప్పిని కలిగిస్తుంది. శ్లేష్మాన్ని పెంచుతుంది. ఇప్పటికే జలుబు ఉంటే, వీటికి దూరంగా ఉండాలి.
స్ట్రాబెర్రీలు: స్ట్రాబెర్రీలలో శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. ఇవి చల్లని వాతావరణంలో శరీరంలో కఫాన్ని పెంచుతాయి. ఇప్పటికే అలెర్జీలు, దగ్గు లేదా గొంతు నొప్పి ఉంటే స్ట్రాబెర్రీలను నివారించడం మంచిది.
అవకాడో: అవోకాడోలు ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప మూలం. కానీ హిస్టామిన్ కంటెంట్ కొంతమందిలో అలెర్జీ సంబంధిత దగ్గు, ఛాతీ రద్దీని పెంచుతుంది. అందువల్ల, శీతాకాలంలో అవకాడో తీసుకోవడం పరిమితం చేయాలి.
చలికాలంలో ఈ పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి
చలికాలంలో ఆపిల్, జామ, నారింజ, అరటిపండ్లు వంటి పండ్లు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా, బలంగా ఉంచడానికి సహాయపడుతాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.


