Friday, September 20, 2024
Homeహెల్త్Garlic milk: వెల్లుల్లి పాలతో ఆరోగ్యం

Garlic milk: వెల్లుల్లి పాలతో ఆరోగ్యం

వెల్లుల్లి పాయలపై పొట్టుతీసి మెత్తగా దంచి పాలల్లో కాసేపు ఉడికించాలి. వేడి చల్లారిన తర్వాత ఆ పాలను తాగితే మనం పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో అని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. వెల్లుల్లి పాలను తయారు చేయడం కూడా చాలా సులువే.

- Advertisement -

ఐదు గ్రాముల వెల్లుల్లిపాయలు, 50 ఎంఎల్ నీరు, 50 ఎంఎల్ పాలు తీసుకోవాలి. నీళ్లు, పాలు కలిపిన మిశ్రమంలో వెల్లుల్లి పేస్టు వేసి అది 50 ఎంఎల్ కు వచ్చేదాకా ఆ మిశ్రమాన్ని ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దాన్ని దించి ఒడగొట్టాలి. ఇలా వడగొట్టిన వెల్లుల్లి పాలను భోజనం చేసిన తర్వాత రోజుకు రెండుసార్లు 10 ఎంఎల్ వరకూ పుచ్చుకోవాలి. ఇలా వెల్లుల్ని తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేమిటంటే..
 వెల్లుల్లిపాలు తాగడం వల్ల తల్లిపాల ఉత్పత్తి పెరుగుతుంది
 జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

 మలబద్దకం సమస్య పోతుంది.
 వ్రుద్ధాప్యం తొందరగా మీద పడదు.
 చాలాకాలం యంగ్ గా కనిపిస్తారు.
 అధిక కొలెస్ట్రాల్ని కూడా వెల్లుల్లిపాలు తగ్గిస్తుంది.
 చర్మ సమస్యలు తలెత్తవు.
 కీళ్లనొప్పులు, మైగ్రేన్ తలనొప్పి వంటివి తగ్గుతాయి.
 ఎముకలు ద్రుఢంగా తయారవుతాయి.
 వెల్లుల్లిలోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. కడుపునొప్పి, బ్లోటింగ్, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలకు ఇది మంచి వంటింటి చిట్కా.
 వెల్లుల్లి పాలు శరీరంలో రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. జలుబు, జ్వరాలను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ ఈ బాధలు పోవడానికి గోరువెచ్చటి పాలల్లో కాస్త వెల్లుల్లిపేస్టు వేసుకుని తాగితే చాలు.
 ఇంకా వెల్లుల్లి పాలు కాన్సర్ ను తగ్గిస్తుంది.
 మధుమేహాన్ని నియంత్రిస్తుంది కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News