Thursday, September 19, 2024
Homeహెల్త్Gastric probs: కడుపులో గ్యాసా?

Gastric probs: కడుపులో గ్యాసా?

మన ఇంట్లోని దినుసులతోనే గ్యాస్ సమస్య నుంచి తక్షణం ఉపశమనం పొందచ్చు

గ్యాసు సమస్యకు వంటింటి చిట్కాలు..
 కొబ్బరినీళ్లు తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది.
 కొత్తిమీర అజీర్తిని తగ్గిస్తుంది. కడుపులో మంటగా ఉన్నా కూడా కొత్తిమీర నివారిస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని తాగితే చాలు.
 గ్యాసు సమస్యపై నిమ్మరసం కూడా బాగా పనిచేస్తుంది.
 అల్లం కూడా గ్యాసు సమస్యను నివారిస్తుంది. ఇందుకోసం రోజూ భోజనానికి ముందు అల్లాన్ని చిన్నముక్కలుగా కట్ చేసి నమిలి తింటే మంచిది.
 గ్యాసు సమస్యను పరిష్కరించడంలో వెల్లుల్లి కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని నేరుగా నమిలి తినొచ్చు. లేదా ధనియాలు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర మూడింటినీ నీళ్లల్లో వేసి బాగా ఉడికించాలి. తర్వాత ఆ ద్రావణాన్ని వొడగట్టి తాగాలి. దీనివల్ల గ్యాసు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
 మిరియాలను పాలలో కలిపి తాగినా కూడా గ్యాసు సమస్య తగ్గుతుంది.
 ఒక గ్లాసులో వేడినీటిని తీసుకుని అందులో కొద్దిగా ఇంగువ కలిపి తాగాలి .ఇలా చేస్తే గ్యాసు సమస్యతో పాటు కడుపునొప్పి, అజీర్తి కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News