Friday, November 22, 2024
Homeహెల్త్Ghee and beauty: నెయ్యితో అందం

Ghee and beauty: నెయ్యితో అందం

ఇంట్లో ఎప్పుడూ నెయ్యి స్టాక్ ఉండేలా చూసుకుంటే..

నెయ్యితో వచ్చే అందాలు ఎన్నో. అవేమిటంటే…

- Advertisement -
  • చర్మంపై ఏర్పడే నల్లని మచ్చలను, సన్ స్పాట్స్ ను నెయ్యి పోగొడుతుంది.
    -నేతిలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
    -చర్మంలో ఆరోగ్యవంతమైన కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
    -ఆక్సేడేటివ్ స్ట్రెస్ కారణంగా తలెత్తే దుష్పరిణాలను తగ్గించడంలో నెయ్యి ఎంతో శక్తివంతగా పనిచేస్తుంది.
  • చర్మానికి కావలసిన హైడ్రేషన్ ని అందించి మ్రుదువుగా చేస్తుంది.
    -మేని ఛాయను మెరిసేలా చేస్తుంది.
    -దెబ్బతిన్న, పొడిబారిన చర్మాన్ని పునరుద్ధరిస్తుంది.
    -చలిలో, పొడి వాతావరణంలో, తీవ్రమైన గాలితో నిండిన వాతావరణంలో చర్మాన్ని కాపాడుతుంది.
    -పగిలిన పెదాలను మ్రుదువుగా చేస్తుంది.

-కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను పోగొడుతుంది.
-కళ్లు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

  • గాయాలకు సాంత్వననిస్తుంది.
    -నెయ్యిలో ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్లతో బాటు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను తటస్థం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
    -చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ను ఇది అందించడం వల్ల చర్మం సహజకాంతితో మెరుస్తుంది.
  • కాంతివిహీనంగా మారిన చర్మాన్ని నెయ్యిలోని పోషకపదార్థాలు ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి.
  • నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు విటమిన్ ఎ ఉండడం వల్ల నేచురల్ మాయిశ్చరైజర్ గా అది పనిచేస్తుంది.
    -చర్మం లోపలికంటా హైడ్రేషన్ ను నెయ్యి అందిస్తుంది. చర్మం ఎలాస్టిసిటీని నెయ్యి మెరుగుపరుస్తుంది.
  • నెయ్యి తినడం వల్ల, చర్మంపై రాసుకోవడం వల్ల కూడా శరీరంపై మంచి ఫలితాలు కనిపిస్తాయి.
    -జుట్టు ఆరోగ్యం కోసం కూడా నెయ్యిను వాడొచ్చు. ఇందులోని విటమిన్ ఎ, ఇ లు జుట్టును సిల్కీగా ఉంచుతాయి.
  • జుట్టు పీచులా అవడానికి కారణమయ్యే విషపదార్థాలను నెయ్యిలో ఉన్న యాంటాక్సిడెంట్లు పోగొడతాయి.
    -చర్మం బిగువుగా ఉండడానికి నెయ్యి దోహదపడుతుంది. నెయ్యిని ఫేస్ మాస్కులో కూడా వాడొచ్చు. మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. గాయాలు వంటి వాటికి స్పాట్ ట్రీట్మెంటుగా నెయ్యి ఉపయోగపడుతుంది.
    -మేకప్ రిమూవర్ గా నెయ్యిని వాడొచ్చు. వేళ్ల చిగుళ్ల ట్రీట్మెంటుకు కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. పొడిబారిన మోకాళ్లు, మోచేతులు, పాదాలపై నెయ్యి బాగా పనిచేసి అవి మ్రదువుగా కనిపించేలా చేస్తుంది.
    -చర్మంపై తలెత్తే తేలికపాటి ఇరిటేషన్లపై నెయ్యి బాగా పనిచేస్తుంది.

-చర్మం ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియలో, చర్మాన్ని ప్రకాశవంతం చేసే ప్రక్రియలో నెయ్యి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. నెయ్యితో ఫేస్ మాస్కులు, స్క్రబ్ లు

  • నెయ్యితో ఫేస్ మాస్కు చేసుకోవచ్చు. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, చిటికెడు పసుపు తీసుకోవాలి. ఈ మూడింటినీ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. శుభ్రంగా, పొడిగా ఉన్న ముఖంపై ఈ పేస్టును అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా ముఖాన్ని కడిగి పొడిగా తుడుచుకోవాలి.

నెయ్యితో మాయిశ్చరైజర్ ను కూడా తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల అలొవిరా జెల్ రెడీ పెట్టుకోవాలి. మొదట సన్నని మంటపై నెయ్యిని కరగనివ్వాలి. అందులో అలొవిరా జెల్ ను వేసి కలిపి దాన్ని చల్లారనివ్వాలి. శుభ్రంగా కడుక్కకున్న ముఖాన్ని పొడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కొని పొడిగా ఉండేలా తుడుచుకోవాలి.

  • -నెయ్యితో హ్యాండ్ క్రీము కూడా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె లేదా బాదం నూనెను, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని కొబ్బరి లేదా బాదం నూనెలో వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చేతులపై రాసుకుంటే చేతులు మ్రుదువుగా తయారవుతాయి. పెదాలు పగిలినపుడు నెయ్యిని అప్లై చేస్తే పగుళ్లు తగ్గి పెదాలు మ్రుదువుగా అవుతాయి. ఇందుకు ఒక టీస్పూను నెయ్యి తీసుకుని పెదాలపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచుకుంటే చాలు మర్నాడు ఉదయానికి మీ పెదవులు గులాబీ రంగులో మిల మిల మెరుస్తాయి.
  • లిప్ స్క్రబ్ ను కూడా మనం చేసుకోవచ్చు. ఇందుకు ఒక టీస్పూను నెయ్యి, ఒక టీస్పూను పంచదార, ఒక టీస్పూను తేనె తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక బౌల్ లో వేసి బాగా కలపాలి. ఆ పేస్టును పెదాలపై వ్రుత్తాకారంలో సున్నితంగా రాస్తూ మర్దనా చేయాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. లేదా మెత్తటి గుడ్డతో పెదాలపై సున్నితంగా ఒత్తితే చాలు. ఆ తర్వాత పెదాలపై నెయ్యిని పలచగా అప్లై చేయాలి. ఇలా చేస్తే పెదాలు నేచురల్ మాయిశ్చరైజర్ తో మెరిసిపోతాయి.
  • -నెయ్యితో బాడీ స్క్రబ్ ను కూడా తయారుచేసుకోవచ్చు. ఇందుకు ఒక టీస్పూను నెయ్యి, ఒక టేబుల్ స్పూను శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల ఆవు పాలు లేదా కొబ్బరిపాలు, ఒక టీస్పూను చక్కెర తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక బౌల్ లో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చర్మంపై పూసి వ్రత్తాకారంలో రాస్తూ సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కుని పొడిగుడ్డతో చర్మాన్ని తుడుచుకోవాలి.
  • -జుట్టుకు, మాడుకు నెయ్యితో తయారుచేసిన మాస్కును రాసుకోవచ్చు. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టీస్పూను తేనె, గుడ్డులోని తెల్లసొన కావాలి. వీటన్నింటినీ ఒక బౌల్ లో వేసి బాగా కలిపి పేస్టులా చేసి దానిని తలకు రాసుకుని గంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఆతర్వాత గోరువెచ్చటి నీటితో తలను బాగా కడుక్కుని జుట్టును ఆరబెట్టుకోవాలి. నెయ్యితో ఈ బ్యూటీ టిప్స్ ను పాటించి చర్మాన్ని, జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకుంటే నలుగురి కళ్లూ మీ మీదే..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News