Ginger Benefits:ఇప్పటి రోజుల్లో అసిడిటీ, గ్యాస్ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. కొంచెమే తిన్నా పొట్ట నిండిపోయినట్టుగా అనిపించడం, మంట, ఉబ్బరం, అసౌకర్యం కలగడం తరచూ కనిపిస్తున్న సమస్యలుగా మారాయి. దీనికి తాత్కాలికంగా మందులు వాడినా, ఎక్కువకాలం వాటిపై ఆధారపడటం శరీరానికి దుష్ప్రభావాలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సహజంగా ఇంట్లో దొరికే పదార్థాలతో జీర్ణ సమస్యలకు పరిష్కారం చూపే చిట్కాను ఒక న్యూట్రిషనిస్ట్ వివరించారు.
అల్లం, నిమ్మరసం…
ఈ పద్ధతిలో కేవలం అల్లం, నిమ్మరసం మాత్రమే ఉపయోగించాలి. వీటిని సరైన విధంగా కలిపి వాడితే గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చని ఆ నిపుణుడు సూచించారు. ఈ రెండు పదార్థాలలోని గుణాలు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి.
Also Read:https://teluguprabha.net/health-fitness/ashwagandha-benefits-and-side-effects-explained-clearly/
రక్త ప్రసరణ ..
అల్లం గురించి చెప్పుకుంటే ఇది ఇంటి వంటల్లో తరచూ వాడే పదార్థమే. కానీ దీని ప్రయోజనాలు చాలా విస్తృతంగా ఉంటాయి. అల్లంలో సహజసిద్ధమైన జింజరాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపులో ఏర్పడే వికారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అదేవిధంగా శరీరంలోని ఇన్ ఫ్లమేషన్ తగ్గి మంట, నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రోజువారీ ఆహారంలో అల్లం వాడటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
విటమిన్ సి అధికంగా..
నిమ్మరసం కూడా ఆరోగ్యానికి బంగారమే. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని టాక్సిన్స్ నుండి రక్షిస్తాయి. కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా అడ్డుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ నిమ్మరసం సహాయపడుతుంది. గుండె సమస్యల రిస్క్ తగ్గించడంలోనూ దీని పాత్ర ఉందని నిపుణులు అంటున్నారు. అయితే, నిమ్మరసం సహజంగా అసిడ్ ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి అధిక మోతాదులో తీసుకుంటే అసిడిటీ ఉన్నవారికి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు.
ఇప్పుడు ఈ రెండు పదార్థాలను కలిపి గ్యాస్ సమస్యను తగ్గించుకునే విధానం ఏమిటంటే ముందుగా సుమారు యాభై గ్రాముల తాజా అల్లం తీసుకోవాలి. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాస్ జార్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత అందులో అర కప్పు నిమ్మరసం పోయాలి. ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు కొద్దిగా నీరు కలపాలి. తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్ల మేర కల్లుప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి కనీసం 24 గంటలు ఉంచాలి. అనంతరం ఇది వాడటానికి సిద్ధమవుతుంది. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే మరింతకాలం ఉపయోగించుకోవచ్చు.
జీర్ణక్రియ సజావుగా..
ఇలా సిద్ధం చేసిన అల్లం ముక్కలను భోజనం తర్వాత తీసుకోవాలి. ఒక్క ముక్కను బాగా నమిలి తింటే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. రోజూ ఒక ముక్క తీసుకోవడం ద్వారా మెటబాలిజం మెరుగుపడుతుంది. అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత ఈ ముక్క వాడటం వలన పొట్ట బిగుసుకోవడం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.
Also Read:https://teluguprabha.net/health-fitness/pink-salt-vs-table-salt-which-is-better-for-health/
నిపుణుల సూచన ప్రకారం ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే, మందుల అవసరం లేకుండానే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది పూర్తిగా సహజ పద్ధతి కావడంతో దుష్ప్రభావాల భయం ఉండదు. అయితే పరిమితికి మించి వాడితే అసౌకర్యం కలగవచ్చని, ముఖ్యంగా నిమ్మరసం విషయంలో జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు.
జలుబు, దగ్గు లాంటి సమస్యలు..
ఇక ఈ మిశ్రమం వాడటం వల్ల కలిగే మరో లాభం ఏమిటంటే రోగనిరోధక శక్తి పెరగడం. జలుబు, దగ్గు లాంటి సమస్యలు తరచూ వచ్చే వారు కూడా ఈ పద్ధతిని అనుసరించడం వల్ల కొంతవరకు లాభం పొందగలరని చెబుతున్నారు. జీర్ణశక్తి పెరగడం వల్ల తిన్న ఆహారం శరీరానికి సరిగ్గా పోషకాలను అందిస్తుంది. అల్లం, నిమ్మరసం కలిపి వాడడం శరీరానికి తేలికగా అనిపించేలా చేస్తుంది.
సాధారణంగా మనం తిన్న వెంటనే గ్యాస్ సమస్య ఎదురైతే వెంటనే టాబ్లెట్ వేసుకోవడం అలవాటు. కానీ ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దీర్ఘకాలికంగా దానివల్ల ఇతర సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి సహజమైన చిట్కాలను పాటించడం శ్రేయస్కరం.


