Friday, November 22, 2024
Homeహెల్త్Glowing skin: చర్మాన్ని మెరిపించే మూడు డ్రింకులు

Glowing skin: చర్మాన్ని మెరిపించే మూడు డ్రింకులు

ఆరోగ్యకరమైన చర్మానికి ఇంట్లోనే చేసుకునే పోషక డ్రింకులు ఉన్నాయి. వీటిని రోజూ తాగడం వల్ల చర్మం అందంతో, ఆరోగ్యంతో మెరిసిపోతుందిట. ఇంతకూ ఆ డ్రింకులేమిటో తెలుసుకుందామా…
మనం తీసుకునే డైట్ ను బట్టి కూడా మన చర్మం మెరుపును సంతరించుకుంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. సహజంగానే ప్రతి ఒక్కరం అలాంటి అందమైన చర్మసౌందర్యం ఉండాలని కోరుకుంటాం. దీనికి నిత్యం చేసే స్కిన్ కేర్ రొటీన్లను కొనసాగిస్తూనే పోషకగుణాలు కలిగిన డ్రింకులు తాగాలంటున్నారు పోషకాహారనిపుణులు. అంతేకాదు చర్మాన్ని దెబ్బతీసే ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

- Advertisement -

ఉదాహరణకు మీ స్కిన్ ను మెరిసేలా చేసే స్మూదీ కూడా ఉందంటున్నారు పోషకాహారనిపుణులు. పాలు, పీనట్ బటర్, చిటికెడు దాల్చినచెక్క పొడి, ఓట్స్, సట్టు పొడి వీటన్నింటినీ కలిపి బ్లెండర్ లో వేసి మ్రుదువైన జ్యూసులా తయారుచేయాలి. అందులో నానబెట్టిన చియా గింజలు వేసి ఈ స్మూదీని సాయంత్రం తీసుకొంటే చర్మంపై ఇది చేసే వండర్స్ ఎన్నో. ఈ స్మూదీ ఎందుకు మంచిదంటే ఇందులో ఉపయోగించిన పాలల్లో కాల్షియం ఉంటుంది. విటమిన్ డి ఉంటుంది. ఇవి రెండు కొల్లాజిన్ ను బాగా ఉత్పత్తిచేస్తాయి.ఇది స్కిన్ టోన్ పై మంచి ప్రభావం చూపుతుంది. ఇందులో ఉపయోగించిన ఓట్స్ కూడా కొల్లాజిన్ ను అధికంగా ఉత్పత్తిచేస్తాయి.

స్కిన్ ఇన్ఫ్లమేషన్ ని బాగా తగ్గిస్తుంది. దీనికి కారణం ఇందులో అమినో ఆమ్లాలు అధికంగా ఉండడమే. ఇకపోతే సట్టు పొడిలో పోషకాలు సమ్రుద్ధిగా ఉంటాయి. ఇది కూడా కొల్లాజన్ ను బాగా ఉత్పత్తిచేయడమే కాకుండా చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. షియా బటర్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో వాడిన దాల్చినచెక్క పొడి వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి కొల్లాజన్ బాగా ఉత్పత్తి అవుతుంది. చర్మాన్ని మెరిపించే మరో డ్రింకు మజ్జిగలో చియా గింజలు కలిపి తయారుచేసిన డ్రింకు. పెరుగు, నీళ్లు, జీలకర్ర పొడి, రాళ్ల ఉప్పు కలిపి బ్లెండర్ వేసి డ్రింకులా చేయాలి. అందులో రాత్రి నానబెట్టిన చియా గింజలను కలిపి తాగాలి. ఇందులో వాడిన చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడమే కాకుండా స్కిన్ ఎలాస్టిసిటీని బాగా మెరుగుపరుస్తుంది. మజ్జిగలో యాంటాక్సిడెంట్లు బాగా ఉన్నాయి. ఫ్రీరాడికల్స్ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని ఇది ఆరోగ్యవంతం చేస్తుంది. చర్మంలోని మలినాలను పోగొట్టడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలను కూడా నివారిస్తుంది. చర్మాన్ని మెరిపించే ఇంకో డ్రింకు ఉంది.
దీన్ని కూడా ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. కొబ్బరినీళ్లల్లో ఒక టేబుల్ స్పూను గోంధు కటిరా వేసి బాగా కలపితే చాలు ఈ డ్రింకు రెడీ. గోంధు కటిరా ఒక మూలిక. దీన్ని త్రగకాంత్ గమ్ అని కూడా అంటారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉపయోగించిన కొబ్బరినీళ్లు చర్మానికి కావలసినంత హైడ్రేషన్, ఎలాస్టిసిటీలను అందిస్తుంది. చర్మాన్ని మెరిసేట్టు చేస్తుంది. ఇందులో చర్మానికి మేలు చేసే విటమిన్ ఎ, సి , కెలు పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే మూలిక గోంధు కటిరాలో మ్యుసిలేజ్ అనే వాటర్ సొల్యుబుల్ ఫైబర్ ఉంది. ఇది చర్మానికి కావలసిన తేమను అందించడమే కాకుండా చర్మం మ్రుదువుగా ఉండేలా చేస్తుంది. మరి మీరూ ఈ డ్రింకులను తాగండి. అందమైన చర్మంతో మెరవండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News