Sunday, October 6, 2024
Homeహెల్త్Grey hair in kids: పిల్లలకు తెల్ల వెంట్రుకలు

Grey hair in kids: పిల్లలకు తెల్ల వెంట్రుకలు

పిల్లల వెంట్రుకలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి

చిన్నారుల్లో తెల్లజుట్టుకు వంటింటి మందులు..
మీ అబ్బాయికి తెల్ల జుట్టు వస్తోందా? చూడడానికి బాబు యాక్టివ్ గా కనిపించడం లేదా? నేడు ఈ సమస్య చిన్నపిల్లల నుంచి యంగ్స్టర్స్ దాకా పెద్దఎత్తున కనిపిస్తోంది. ఇలా పిన్న వయసులోనే జుట్టు తెల్లబడడానికి జన్యు కారణాలు ఒకటైతే, వంశపారంపర్యంగా కూడా కొందరు ఈ సమస్య బారిన పడుతున్నారు. తెల్లజుట్టు రావడానికి ప్రిమెచ్యూర్ ఏజింగ్ డిజార్డర్లు కూడా మరో కారణం.

- Advertisement -

ఇవి కాకుండా తీవ్ర ఒత్తిడి, మీరు వాడుతున్న షాంపులు, సబ్బులు, అతినీలలోహిత కిరణాల బారిన పడ్డం కూడా పిన్న వాళ్లల్లో తెల్లజుట్టు రావడానికి మరికొన్ని కారణాలు. తెల్ల జుట్టు వస్తే వైద్య సంబంధమైన కారణాలున్నాయా అనేది మొదట నిర్ధారించుకోవాలి. పిల్లల్లో కూడా కనిపించే ఈ సమస్యకు డైట్ మంచి పరిష్కారం. పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను పిల్లలకు బాగా పెట్టాలి. పోషకాహారలోపం వల్లే ఈ సమస్య ప్రధానంగా వస్తుంది. పిల్లల్లో తెల్లజుట్టు రావడానికి విటమిన్స్ బి12, డి3, కాల్షియం వంటి
వాటి లోపం కూడా మరో ప్రధాన కారణం.

ఈ సమస్యను అధిగమించడానికి వంటింటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. ఆమ్లా దీనికి మంచి చిట్కా. ఇందులో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. తెల్లజుట్టు రాకుండా నిరోధించడానికి దీన్నిహెయిర్ ఆయుల్ గా ఉపయోగిస్తారు. జుట్టు పెరిగేలా, బలంగా ఉండేలా కూడా ఆమ్లా చేస్తుంది. ఇందుకోసం మూడు లేదా నాలుగు ఉసిరికాయలు, ఒక కప్పు నీళ్లు రెడీ పెట్టుకోవాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసుడు నీళ్లల్లో వేసి కొంతసేపు బాగా ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆర్పి ఆ నీళ్లను చల్లారనిచ్చి వొడగొట్టాలి. ఆ మిశ్రమాన్ని తెల్లజుట్టున్న మీ చిన్నారుల తలకు బాగా రాయాలి.


తెల్ల వెంట్రుకలు రాకుండా కొబ్బరినూనె కూడా సంరక్షిస్తుంది. కొబ్బరిననూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు బాగా ఉన్నాయి. ఇందువల్ల తెల్లజుట్టులో ప్రొటీన్ తగ్గడం పోతుంది. జుట్టు నిగనిగలాడుతుంది. ఇందుకోసం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకుని దాన్ని మాడుకు, వెంట్రుకలకు అప్లై చేయాలి. నూనె రాసుకున్న తర్వాత గంట సేపు అలాగే ఉంచుకోవాలి. తర్వాత మైల్డ్ క్లీన్సర్ తో బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత వెంట్రుకలకు కండిషనర్ అప్లై చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయొచ్చు. జుట్టు నల్లగా నిగ నిగలాడడానికి నేచురల్ డైగా అలొవిరా జ్యూసు బాగా ఉపయోగపడుతుంది. తెల్లజ్టుట్టు నల్లరంగులో మెరిసేలా వేగంగా పనిచేస్తుంది. అలొవిరా జెల్ లో కాల్షియం, సెలినీయం, జింక్, క్రోమియం, కాపర్ వంటి ఖనిజాలు చాలా ఉన్నాయి.

మీ పాప తెల్లజుట్టు సమస్య పరిష్కారం కావాలంటే ఒక కప్పు అలొవిరా జ్యూసు తీసుకోవాలి. అందులో నేచురల్ డైస్ అయిన హెన్నా, కాఫీ లను కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ బాబు లేదా పాప జుట్టుకు, మాడుకు అప్లై చేసి గంట పాటు అలాగే ఉంచి ఆతర్వాత చల్లటి నీళ్లతో తలను బాగా కడగాలి. రెండు మూడు నెలలకొకసారి ఇలా చేస్తే మంచిది. కాఫీ, హెన్నా కలపకుండా కేవలం అలొవిరా జ్యూసు మాత్రమే అయితే వారానికి ఒకసారి జుట్టుకు ఈ జ్యూసును అప్లై చేస్తే సరిపోతుంది. చిన్నారుల్లో తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించాలంటే ఇంకొక చిట్కా కూడా ఉంది. అది ఏమిటంటే తెల్ల జుట్టును కరివేపాకు కూడా నల్లగా చేస్తుంది. ఈ ఆకుల్లో బయోయాక్టివ్ కాంపౌండ్లు ఉనాయి. ఇవి జుట్టను నిగ నిగలాడేలా చేయడమే కాదు చిన్న వయసులో జుట్టు తెల్లబడకుండా నిరోధిస్తుంది కూడా. ఇందుకు 20 కరివేపాకులు తీసుకోవాలి. అర కప్పు వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా రెడీ పెట్టుకోవాలి. ఒక కప్పు వర్జిన్ కొబ్బరినూనెలో 20 వరకూ కరివేపాకులు వేయాలి. సాస్ ప్యాన్ లో ఈ రెండింటినీ వేసి బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ కాస్తా నల్ల రంగులోకి రాగానే స్టవ్ ఆపేసి వేడిగా ఉన్న ఆ నూనెను చల్లారనివ్వాలి. ఆ తర్వాత దాన్ని మీ పిల్లల జుట్టుకు, మాడుకు అప్లై చేసి గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత జుట్టును నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. వారానికి ఒకసారి దీన్ని వెంట్రుకలకు రాసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు.


హెన్నా హెయిర్ ప్యాక్ లో నేచురల్ డైయింగ్ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇది తలలోని తెల్ల వెంట్రుకలను పోగొడుతుంది. తెల్లజుట్టుతో బాధపడుతున్న చిన్నారులకు కూడా ఇది చాలా మంచిది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక కప్పు హెన్నా పొడి, సరిపడినన్ని నీళ్లను సిద్ధంచేసుకోవాలి. గ్లోవ్స్ కూడా రెడీ పెట్టుకోవాలి. కప్పు హెన్నాలో తగినన్ని నీళ్లు పోసి చిక్కటి పేస్టులా చేయాలి. బాగా మెత్తగా కలిపిన ఆ పేస్టును గ్లోవ్స్ తో మీ పిల్లాడి తలమీద అప్లై చేసి గంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో తలను శుభ్రంగా కడగాలి. రెండు మూడు నెలలకు ఒకసారి దీన్ని తలకు అప్లై చేసుకుంటే చాలు. తెల్లజుట్టు పోగొట్టే మరొక శక్తివంతమైన చిట్కా భృంగరాజ్. ఇది నేచురల్ డై. ఇందులో బయోయాక్టివ్ కాంపౌడ్లు బాగా ఉన్నాయి. మెలానొజెనెసిస్ ఉంది. ఇది తెల్లజుట్టును వేగంగా నల్ల రంగులోకి మార్చి నిగనిగలాడేట్టు చేస్తుంది.

తెల్లజుట్టు బారిన పడిన పిల్లలకు బ్లాక్ కాఫీని హెయిర్ కలర్ గా వాడొచ్చు. ఇందుకోసం రెండు లేదా మూడు కప్పుల నీళ్లు, నాలుగు లేదా ఐదు టీస్పూన్ల కాఫీ పొడి రెడీ పెట్టుకోవాలి. రెండు లేదా మూడు కప్పుల నీటిని ఉడికించాలి. ఐదు టీస్పూన్ల కాఫీ పొడిని కొద్ది నీటిలో వేసి బాగా కలపాలి. ఆ చిక్కటి మిశ్రమాన్ని ఉడకబెట్టిన వేడి నీళ్లల్లో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత దాన్ని మీ చిన్నారి జుట్టుకు అప్లై చేసి ఇరవై నుంచి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఇలా నాలుగైదు వారాలకొకసారి చేయొచ్చు. మెంతులు ఇంకొక వంటింటి చిట్కా. ఈ గింజల్లో ఐరన్, కాల్షియం, కాపర్ బాగా ఉన్నాయి. ఈ మూడింటి లోపం వల్ల కూడా జుట్టు పిన్నవయసులోనే తెల్లబడే అవకాశం ఉంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల మెంతి గింజలు, రెండు టీస్పూన్ల నీళ్లు, ఒక టేబుల్ స్పూను పెరుగు ఈ మూడింటినీ రెడీగా పెట్టుకోవాలి. నీళ్లల్లో మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్న నానిన మెంతి గింజలను మెత్తటి పేస్టులా చేయాలి. ఈ పేస్టులో పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత ఆ పేస్టును మాడుకు రాసుకుని పది నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో , షాంపుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయాలి.

ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే మీ చిన్నారులను వేధిస్తున్న తెల్లవెంట్రుకలు సమస్య పోవడంతోపాటు నిగ నిగలాడే నల్ల జుట్టుతో ఎంతో ఆకర్షణీయంగా, మరింత ఆరోగ్యంగా కనిపిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News