పిన్న వయసులోనే కొందరు తెల్లజుట్టు సమస్యతో బాధపడుతుంటారు…. డైట్ లో మార్పులు చేయడం ద్వారా, ఆమ్లా, షీకాకాయ్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అలాంటి టిప్స్ కొన్ని…
జుట్టు తెల్లబడిపోవడం వారసత్వంగా వస్తుంది. తీవ్ర ఒత్తిడికి గురైనా వెంట్రుకలు తొందరగా తెల్లబడతాయి. టెస్టోస్టెరాన్ లు ఎక్కువగా ఉన్న వారిలో కూడా పిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. సమతులాహారం తీసుకోకపోయినా, బాగా పోషకాలు ఉన్న ఆహారపదార్థాలు తినకపోయినా కూడా ఈ సమస్య తలెత్తుతుంది.
ఆరోగ్యకరమైన డైట్ మాత్రమే కాదు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శిరోజాల టెక్చ్సెర్ బాగా ఉండడమే కాదు జట్టు నల్లగా నిగ నిగ లాడుతుంటుంది. వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
నానబెట్టిన రీతా, షీకాకాయ్ గింజల్ని బాగా ఉడికించి ఆ నీళ్లను వెంట్రుకలకు షాంపుగా వాడితే మంచిఫలితం ఉంటుంది.
ఎండిన ఉసిరముక్కల్ని రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి జుట్టుకు కండిషనర్ గా వాడాలి.
మానసిక, శారీరక ఒత్తిడి వల్ల కూడా పిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. శరీరం ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలంటే హోమియోపతి బాగా పనిచేస్తుంది.
మీరు నిత్యం తీసుకునే డైట్ లో కాయగూరలు, పండ్లు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే వీటిల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సరిగా జరిగేలా సహకరిస్తాయి.
త్రుణధాన్యాలు, సెరియల్స్, చికెన్, గుడ్లు, చేపలు మీరు తీసుకునే డైట్ లో ఉండేట్టు చూసుకోండి. వీటిల్లో ప్రొటీన్లు బాగా ఉంటాయి. ఇవి తెల్లజుట్టు రాకుండా సంరక్షిస్తాయి.
ఆర్టిఫీషియల్ ప్రిజర్వేటివ్స్ ఉండే ఆహారపదార్థాలు తినొద్దు. ఇవి జీర్ణక్రియను క్లిష్టతరం చేస్తాయి. జీర్ణవ్యవస్థ సరిగా లేకపోతే దాని దుష్పరిణామాలు శరీరంపై పడతాయి. ప్రొటీన్ ఫుడ్ శరీరానికి అందదు. దీంతో తలెత్తే అనేక అనారోగ్య సమస్యలతో పాటు పిన్న వయసులోనే తెల్ల జుట్టు బారిన పడతారు.