Saturday, November 15, 2025
Homeహెల్త్Menopause:మోనోపాజ్ వల్ల ఇన్ని ప్రాబ్లెమ్స్‌ ఉంటాయా..? క్లారిటీ ఇచ్చిన వైద్యులు!

Menopause:మోనోపాజ్ వల్ల ఇన్ని ప్రాబ్లెమ్స్‌ ఉంటాయా..? క్లారిటీ ఇచ్చిన వైద్యులు!

Menopause VS Women Health: స్త్రీల జీవితంలో సహజంగా వచ్చే ఒక దశనే మెనోపాజ్ అని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా పన్నెండు నెలలపాటు రుతుస్రావం ఆగిపోయినప్పుడు మెనోపాజ్ ప్రారంభమైందని పరిగణిస్తారు. ఈ దశలో శరీరంలో హార్మోన్ స్థాయిలు మారుతాయి, దాంతో శారీరకంగా మరియు మానసికంగా కొన్ని మార్పులు కనిపిస్తాయి. అయితే ఈ విషయంపై సమాజంలో అనేక రకాల అపోహలు ఉండటం వలన చాలామంది మహిళలు భయపడుతూ ఉంటారు. తాజాగా గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ గైనకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఆస్థా దయాల్ మెనోపాజ్ గురించి వివరాలు చెబుతూ ఈ అపోహలకు సమాధానమిచ్చారు.

- Advertisement -

ఒక్క రోజులో జరిగిపోదు…

డాక్టర్ దయాల్ మాటల్లో చెప్పాలంటే, మెనోపాజ్ ఒక్క రోజులో జరిగిపోదు. ఇది క్రమంగా వచ్చే ప్రక్రియ. సాధారణంగా ఇది 45 నుంచి 55 సంవత్సరాల మధ్యలో వస్తుంది. కొందరిలో జన్యుపరమైన కారణాలు లేదా కొన్ని వైద్య చికిత్సల వలన ఇది ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దశలో రుతుస్రావం ఒక్కోసారి ముందుకి వెనక్కి అవుతూ అస్థిరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి చాలామందిని భయపెట్టినా, ఇది సహజమైనదని ఆమె చెప్పారు.

తీవ్రమైన లక్షణాలు..

మెనోపాజ్ అనగానే మహిళలు తీవ్రమైన లక్షణాలు తప్పనిసరిగా వస్తాయని అనుకుంటారు. వాస్తవానికి ప్రతి ఒక్కరికీ ఒకేలా లక్షణాలు రావు. కొందరిలో వేడి ఆవిర్లు, చిరాకు, నిద్రలేమి వంటి సమస్యలు తక్కువ స్థాయిలోనే ఉంటాయి. వీటిని జీవనశైలిలో చిన్నచిన్న మార్పులతో నియంత్రించవచ్చు. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం, సరిపడ నిద్ర ఇవన్నీ శరీరానికి ఉపశమనం ఇస్తాయి. అవసరమైతే డాక్టర్ సూచించిన మందులు కూడా సహాయపడతాయి.

లైంగిక జీవితం…

చాలామంది మహిళలు మెనోపాజ్ వచ్చిన తర్వాత లైంగిక జీవితం ముగిసిందని అనుకుంటారు. కానీ ఇది కూడా తప్పు. హార్మోన్ మార్పులు లైంగిక కోరికలను తగ్గించవచ్చని నిజమే కానీ సరైన చికిత్సలతో ఇవి సరిచేయవచ్చు. లూబ్రికెంట్స్ లేదా హార్మోన్ థెరపీ ద్వారా సమస్యను అధిగమించవచ్చు. మెనోపాజ్ తర్వాత కూడా అనేక మహిళలు సంతోషంగా తమ వ్యక్తిగత జీవితం కొనసాగిస్తున్నారని డాక్టర్ దయాల్ తెలిపారు.

బరువు పెరుగుతుందని…

అత్యంత సాధారణమైన అపోహల్లో ఒకటి మెనోపాజ్ వస్తే బరువు ఆటోమేటిక్‌గా పెరుగుతుందని అనుకోవడం. డాక్టర్ దయాల్ ప్రకారం, హార్మోన్ల మార్పుల వలన శరీరంలో కొవ్వు నిల్వల పంపిణీ మారవచ్చు. కానీ బరువు పెరగడం మెనోపాజ్ కారణంగా తప్పనిసరిగా జరగదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, సరైన నిద్ర ఇవన్నీ పాటిస్తే బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అంటే మెనోపాజ్ బరువు పెరుగుదలకు ప్రత్యక్ష కారణం కాదని ఆమె స్పష్టం చేశారు.

మరొక అపోహ ఏమిటంటే, 40 ఏళ్లు దాటాక గర్భం ధరించడం సాధ్యం కాదనుకోవడం. రుతుస్రావం పూర్తిగా ఆగిపోకపోతే గర్భం దాల్చే అవకాశం ఇంకా ఉంటుంది. అందువల్ల పెరిమెనోపాజ్ సమయంలో కూడా గర్భనిరోధక పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. లేదంటే అనుకోని గర్భధారణ జరిగే ప్రమాదం ఉంటుంది.

Also Read:https://teluguprabha.net/health-fitness/iron-deficiency-symptoms-that-cause-fatigue-despite-enough-sleep/

హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) గురించి కూడా అనేక అపార్థాలు ఉన్నాయి. చాలా మంది ఇది ప్రమాదకరమని భావిస్తారు. కానీ డాక్టర్ దయాల్ మాటల్లో చెప్పాలంటే, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ సూచిస్తే ఇది సురక్షితమైనదే కాకుండా ప్రభావవంతమైనదిగా ఉంటుంది. ముఖ్యంగా తీవ్రమైన లక్షణాలతో ఇబ్బంది పడుతున్న మహిళలకు ఇది ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీని ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి గైనకాలజిస్ట్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad