ఇటీవల కాలంలో ఎంతోమంది యువతీయువకుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలిపోతోంది. తినే తిండిలో పోషకాలు లేకపోవడమే ఇందుకు కారణం. పోషకాలతో ఉండి ఉండే ఆహారపదార్థాలను నిత్యం తింటే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. జుట్టు నిగనిగలాడుతూ ఎంతో అందంగా ఉంటుంది. అలాంటి పోషకాలతో కూడిన కొన్ని ఫుడ్స్ మీకోసం..
పాలకూర తినడం వల్ల శిరోజాలు బాగా పెరుగుతాయి. ఇందులోని విటమిన్ సి, ఎ, ఐరన్, ఫోలేట్‌లు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నా జుట్టు ఊడిపోతుంది. అందుకే నిత్యం పాలకూర మీ భోజనంలో ఉండేలా చూసుకోండి. దీంతోశరీరానికి తగినంత ఐరన్ అంది జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ప్రొటీన్లు బాగా ఉండే ఆహారం తీసుకోవాలి. గుడ్డులో ఎన్నో ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి జుట్టు పెరగడాపనికి సహాయపడ్డమే కాదు జట్టును ఒత్తుగా ఉండేలా చేస్తాయి. గుడ్డులోని ప్రొటీను, బయోటిన్‌లు వెంట్రుకలు రాలకఁండా నిరోధిస్తాయి. కెరటైన్ అనే ప్రొటీన్‌తో జుట్టు ఉండిఉంటుంది. అందుకే వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా ఉండడానికి పోషకాలుండే ఆహారం తీసుకోవాలి. గుడ్డులోని జింకు, సెలెనియంలు కూడా వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా ఉపకరిస్తాయి. శిరోజాలు నిగ నిగలాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే బెర్రీలు బాగా తినాలి. వీటిల్లో విటమిన్ సి తో పాటు యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జట్టు కుదుళ్లను బలంగా, పటిష్టంగా ఉంచుతాయి. రకరకాల బెర్రీలు ఉంటాయి. వీటిలో ఏ రకం బెర్రీ తిన్నా కూడా శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ సిలో ఉండే కొల్లోజిన్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. బెర్రీల్లోని యాంటాక్సిడెంట్లు వెంట్రుకలను చిట్లకుండా సంరక్షిస్తాయి. బాదంపప్పులు కూడా జుట్టుకు ఎంతో మంచి చేస్తాయి. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు జింకు, విటమిన్ ఇ, బి6, బి1, సెలీనియంలు ఉంటాయి. జుట్టు పెరగడానికి ఈ విటమిన్లు ఎంతో ఉపయోగపడతాయి. జుట్టు మొదళ్ల నుంచి కాంతివంతంగా, దృఢంగా బాదంలు ఉంచుతాయి. జుట్టు సంరక్షణకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. కాలుష్య ప్రభావం జుట్టు మీద పడకుండా వెంట్రుకలు ఆరోగ్యంగా పెరిగేలా సహకరిస్తాయి. బాదంపప్పుల్లో మెగ్నీషియం కూడా బాగా ఉంటుంది. ఇది జుట్టు వొత్తుగా ఉండేలా చేస్తుంది.
చియా గింజల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కాపర్, ఫాస్ఫరస్ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇవి జుట్టు ఒత్తుగా ఉండేలా చేస్తాయి. అలాగే చియా గింజల్లోని కెరాటిన్ ప్రొటీన్ జుట్టు ఒత్తుగా, బలంగా ఉండేలా చేస్తుంది. చియా గింజల్లోని కాపర్ జుట్టు చిట్లకుండా కాపాడుతుంది. శిరోజాలు పెరిగేలా చేస్తుంది. మాడుకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.