Friday, September 20, 2024
Homeహెల్త్hair care in Summer: వేసవిలో వెంట్రుకల సంరక్షణ

hair care in Summer: వేసవిలో వెంట్రుకల సంరక్షణ

వేసవి వచ్చేసింది. వేడి తాపం చర్మం మీదే కాదు శిరోజాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. సూర్యుని నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు వెంట్రుకలను దెబ్బతీస్తాయి. చెమట కారణంగా శిరోజాలు చుండ్రు బారిన పడతాయి. అందుకే వేసవికాలంలో జుట్టు సంరక్షణకు కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా అనుసరించాలంటున్నారు శిరోజాల నిపుణులు. అవేమిటంటే..

- Advertisement -

 తీవ్రమైన వేడి, తేమదనం వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి. వెంట్రుకలు టెక్స్చెర్ ను కోల్పోయి బిరుసుగా తయారవుతాయి. అంతేకాదు మాడుపై చెమట, జిడ్డు బాగా పేరుకుంటాయి. ఫలితంగా తలపై చుండ్రు చేరడమే కాకుండా బాగా దురదపెడుతుంటుంది. అందుకే తప్పనిసరిగా తేలికపాటి షాంపుతో తలస్నానం చేయాలి. గోరువెచ్చని నీటితో మాడును మసాజ్ చేసుకోవాలి. మాడును మసాజ్ చేసుకోవడం వల్ల తలలో రక్తప్రవాహం బాగా జరుగుతుంది.

 సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల బారిన వెంట్రుకలు పడకుండా సంరక్షించుకోవాలి. ఈ కిరణాల వల్ల జుట్టు గిడసబారినట్టవడమే కాకుండా వెంట్రుకలు చిట్లుతాయి. అందుకే ఈ సీజన్ లో సూర్యకాంతి తలపై పడకుండా టోపి లేదా స్కార్ఫ్ ధరించాలి. సూర్య కాంతి కారణంగా వెంట్రుకలు దెబ్బతినకుండా ఉండేందుకు ఎస్ పిఎఫ్ ఉన్న లీవ్-ఇన్ కండిషనర్ తలకు రాసుకోవాలి.

 వేసవి తాపం వల్ల వెంట్రుకలు బిరుసెక్కిపోతాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సహజపదార్థాలైన కొబ్బరినూనె, షియా బటర్, తేనె మూడింటినీ కలిపి తయారుచేసిన హెయిర్ మాస్కును వెంట్రుకలకు అప్లై చేసుకోవాలి. ఈ మాస్కు వెంట్రుకలకు కావలసిన తేమను అందించడమే కాదు శిరోజాలు నిగనిగలాడేలా చేస్తుంది.

 ఈ సీజన్ లో సూర్యతాపం, ఉక్క వాతావరణం బాగా ఉంటుంది కాబట్టి బ్లో డ్రైయర్స్, ఫ్లాట్ ఐరన్స్ , కర్లింగ్ ఐరన్ప్ వంటి హీట్ స్టైలింగ్ టూల్స్ వాడొద్దు. ఇవి మీ జుట్టుకు మరింత హాని చేస్తాయి. సహజగాలితో వెంట్రుకలు ఆరిపోయేట్టు చూసుకోవాలి. లేదా వెంట్రుకలు ఆరడానికి డిఫ్యూజర్ ను వాడాలి.

 వేసవిలో తప్పనిసరిగా జుట్టును ట్రిమ్ చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన వెంట్రుకల కోసం హెయిర్ కట్స్ చేసుకోవాలి. ఆరు నుంచి ఎనిమిది వారాలకు ఒకసారి వెంట్రుకలను ట్రిమ్ చేసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకల కొసలు చిట్లవు. దెబ్బతినవు. అంతేకాదు చూడడానికి శిరోజాలు ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

 వేసవికాలంలో వెంట్రుకలు శుభ్రంగా ఉండేలా వెంట్రుల సంరక్షకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 వేసవిలో ఎలాంటి హెయిర్ ట్రీట్మెంట్లు తీసుకోవద్దు. శిరోజాలకు రసాయనాలతో కూడిన కాస్మొటిక్ ఉత్పత్తులను వాడొద్దు. వేసవిలో జుట్టుకు తరచూ రంగు వేసుకోవడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే శిరోజాల టెక్స్చెర్ దెబ్బతింటుంది.

 మీ జుట్టుకు సరిపడే కండిషనర్ ను మాత్రమే వాడాలి. కండిషనర్లు జుట్టును సిల్కీగా, మ్రుదువుగా ఉంచుతాయి. నేచురల్ డీప్ కండిషనింగ్ ను వారానికి ఒకసారి చేసుకోవడం వల్ల వెంట్రుకలకు ఎక్స్ ట్రా మాయిశ్చరైజర్ అందుతుంది.

 వేసవి కాలంలో రోజూ షాంపుతో తలస్నానం చేస్తుంటారు చాలామంది. కానీ ఇది మంచిది కాదు. అలా చేస్తే మాడు, వెంట్రుకలు బాగా పొడిబారి పోతాయి. అంతేకాదు మాడుపై చెమట పట్టడంతో పాటు జిడ్డుగా ఉంటుంటే తేలికపాటి షాంపుతో తలస్నానం చేయొచ్చు.

 తలదువ్వుకోవడానికి హెయిర్ బ్రష్ బదులు వెడల్పాటి పళ్లున్న దువ్వెన్నను వాడితే వెంట్రుకల చిక్కు సులభంగా పోతుంది. వెంట్రుకలు ఊడవు. వెంట్రుకలపై హెయిర్ బ్రష్ వాడితే ఎక్కువ వెంట్రుకలు ఊడిపోయే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News