శిరోజాలను ఇవి తిరిగి పెరిగేలా చేస్తాయి…
మనలో చాలామందికి రకరకాల కారణాల వల్ల జుట్టు ఊడిపోతుంటుంది. అలా జుట్టు రాలిపోయినపుడు అది తిరిగి పెరిగేలా చేసే కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఉల్లిపాయలు. ఇవి జుట్టు తిరిగి పెరిగేలా చేయడంలో ఎంతో సహాయపడతాయి. ఉల్లిపాయల్లోని సల్ఫర్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. జుట్టు తిరిగి పెరిగేలా తోడ్పడుతుంది.
ఇంకొకటి అలొవిరా. ఇందులో ప్రొటియోలిటిక్ ఎంజైములు చాలా ఉన్నాయి. ఇవి మాడులో దెబ్బతిన్న కణాలను పునరుద్ధరిస్తాయి. అంతేకాదు మాడుకు కావలసిన సాంత్వనను కూడా అందిస్తాయి. అందరి వంటిళ్లల్లో తప్పనిసరిగా మెంతులు ఉంటాయి. మెంతుల్లో ఐరన్, ప్రొటీన్లు బాగా ఉంటాయి. ఎంతో అత్యావశ్యకమైన ఈ పోషకాలు జుట్టును తిరిగి పెరిగేలా చేయడంలో ఎంతో కీలకంగా సహకరిస్తాయి. పలచబడ్డ జుట్టు తిరిగి ఒత్తుగా పెరిగేలా చేయడంలో బియ్యం నీళ్లు బాగా పనిచేస్తాయి. రాత్రి ఈ నీళ్లను తలకు రాసుకుని ఉదయం లేచిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల వెంట్రుకలు తిరిగి ఆరోగ్యవంతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మరో చిట్కా ఏమిటంటే రోజ్ మేరీ జుట్టును ఒత్తుగా చేయడంలో, పలచబడ్డ వెంట్రుకలు తిరిగి ద్రుఢంగా పెరిగేలా చేయడంలో ఎంతో తోడ్పడుతుంది. కోడిగుడ్డు కూడా ఊడిపోయిన వెంట్రుకలను తిరిగి పెరిగేలా చేయడమే కాదు జుట్టును సిల్కీగా, మరింత ఒత్తుగా, మ్రుదువుగా మెరిసేలా చేస్తుంది. వీటితో పాటు పిప్పర్మెంట్ ఆయిల్ రక్తప్రసరణ బాగా జరిగేట్టు చేయడం ద్వారా జుట్టు పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలకుండా శక్తివంతంగా పోరాడుతుంది. గోరువెచ్చగా చేసిన ఆముదం నూనెను మాడుపై రాసుకుని సున్నితగా మసాజ్ చేస్తే కూడా జుట్టు కుదుళ్లు పటిష్టపడతాయి. దాంతో జుట్టు బాగా పెరుగుతుంది కూడా.
అలొవిరా, రోజ్మేరీ ఆయిల్ రెండింటినీ కలిపి పేస్టులా చేసి హెయిర్ మాస్కులా తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గడమే కాదు జుట్టు తిరిగి బాగా పెరుగుతుంది. పైగా జుట్టు రాలిపోకుండా నియంత్రిస్తుంది కూడా. దాంతోపాటు చుండ్రును తగ్గిస్తుంది. దురదపెడుతున్న మాడుకు ఎంతో సాంత్వననిస్తుంది. మరి వీటిని మీరూ ప్రయత్నించండి. చర్మనిపుణుల సలహాలు కూడా తప్పనిసరిగా తీసుకోండి….