Sunday, July 7, 2024
Homeహెల్త్Hair loss: బియ్యం కడిగిన నీళ్లతో ఒత్తైన శిరోజాలు

Hair loss: బియ్యం కడిగిన నీళ్లతో ఒత్తైన శిరోజాలు

సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లను బయట పారబోసేస్తుంటాం. కానీ ఆ నీటితో ఎన్నో బ్యూటీ లాభాలు ఉన్నాయట. చర్మ, కేశ సౌందర్యానికి, సంరక్షణకు బియ్యం నీళ్లు ఎంతో ఉపయోగపడతాయిట. బియ్యం కడిగిన నీళ్లల్లో విటమిన్ బి, సి, ఇ, అమినో ఆమ్లాలు ఉంటాయిట. ఇవి శిరోజాల పెరుగుదలను వేగం చేస్తాయట. వెంట్రుకలు పొడిబారి, కాంతివిహీనంగా ఉంటే బియ్యం నీటిని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత వెంట్రుకలను శుభ్రంగా కడిగేసుకోవాలిట.

- Advertisement -

ఇలా వారానికి ఒకసారి చొప్పున కొన్ని వారాలు వరుసగా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందిట. బియ్యం కడిగిన నీటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం లేచిన తర్వాత వాటిని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత వెంట్రుకలను శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నిగ నిగ లాడుతుంది.

బియ్యం నీటితో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల మాడు కూడా శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుందిట. చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా పోతాయట. అలాగే బియ్యం నీళ్లను ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటే ముఖంపై ఉండే చర్మం మెరుపును సంతరించుకుంటుంది. ముఖం మీద మచ్చలుంటే కూడా మెల్లగా పోతాయి. చర్మం మ్రుదువుగా తయారవడమే కాదు పట్టులా మెరుస్తుంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News