Hands tremors problem in youth మనం సాధారణంగా యువకుల లేదా వయసు పైబడిన వారి చేతులు వణకటం చూస్తూనే ఉంటాం. పరీక్షల ముందు లేదా ముఖ్యమైన ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు చేతులు వణకటం గమనిస్తూనే ఉంటాం. అయితే టెన్షన్ వల్లనే వణుకు వస్తుందని అనుకోవడం సర్వసాధారణం. కానీ మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నా.. ఒక్కోసారి చేతులు వణకటం జరుగుతుంది. అయితే ఈ వణుకు అనేది కేవలం ఒత్తిడికి సంబంధించిన లక్షణమా.. లేక మరేమైనా ఇతర కారణాలు దాగి ఉన్నాయా తెలుసుకుందాం.
సాధారణంగా వయసు పైబడిన వారిలో ఇలాంటి సమస్యను మనం చూస్తూ ఉంటాం. వృద్ధుల శరీరం అలసట చెంది చేతులు వణకటం మనం గమనిస్తాం. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది యువత చేతులు వణకటం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యలకు గల కారణాలను తెలుసుకుందాం.
ఒత్తిడితో కూడిన ఆందోళన: సహజంగా ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. దీంతో చేతులు వణకటం మొదలవుతుంది.
వంశపారపర్యంగా: ఇది సాధారణంగా వంశపారపర్యంగా వచ్చే నాడీ సంబంధిత సమస్యగాను మనం పరిగణించవచ్చు. రాయడం, గ్లాస్ పట్టుకోవడం లాంటి పనులు చేస్తున్నప్పుడు ఎక్కువ మందిలో ఈ సమస్య కనిపిస్తుంది.
కాఫీ, టీ అధికంగా తీసుకోవడం: కెఫిన్ అధికంగా తీసుకోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్‌లో ఎక్కువగా కెఫిన్ ఉంటుంది. అలాంటి డ్రింక్స్ వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమై వణుకు వస్తుంది.
Also Read:https://teluguprabha.net/health-fitness/neem-leaves-benefits-in-our-life/
థైరాయిడ్ హార్మోన్: థైరాయిడ్ గ్రంధి అధిక హార్మోన్లను ఉత్పత్తి చేయడం కూడా.. చేతులు వణుకు కు కారణం కావచ్చు. అంతేకాక బీ విటమిన్ లోపం వల్ల కూడా వణుకు రావచ్చు.
వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం: వణుకు రోజువారి పనులకు అడ్డగా ఉంటే అస్సలు నిర్లశ్యం చేయకూడదు. వణుకు తీవ్రమవుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వారు మీ లక్షణాలను బట్టి సరైన పరీక్షలు చేస్తారు. దానికి అనుగుణంగా చికిత్సను సూచిస్తారు.


