Friday, November 22, 2024
Homeహెల్త్Health & Beauty: అందం, ఆరోగ్యం @ కొత్తిమీర

Health & Beauty: అందం, ఆరోగ్యం @ కొత్తిమీర

కొత్తిమీరను వంటల్లో వాడతాం. చర్మం యంగ్ గా కనిపించేలా కూడా కొత్తిమీర చేస్తుంది. కొత్తిమీరలో విటమిన్ సి లాంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. జిడ్డు చర్మం ఉన్నవారికి కొత్తిమీర తెచ్చే చర్మసౌందర్యం ఎంతో. ఈ ఆకులో సహజసిద్ధమైన యాంటీసెప్టిక్,యాంటిమైక్రోబయల్, యాంటీఫంగల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కొత్తిమీర చర్మానికి తగిన సాంత్వనను, చల్లదనాన్ని సైతం ఇస్తుంది. ఇది అందానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవేమిటంటే…

- Advertisement -


 ముఖం మీద ఏర్పడ్డ నల్లమచ్చలను, యాక్నేను కొత్తిమీర పోగొడుతుంది. ఒక టీ స్పూన్ కొత్తిమీర ఆకుల పేస్టులో ఒక టీస్పూన్ నిమ్మరసం పిండి ఆ మిశ్రమాన్ని నల్లమచ్చలు, యాక్నే ఉన్న చోట మసాజ్ చేసినట్టు రాసి ఒక గంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే నల్లమచ్చలు, యాక్నే పోతాయి.

 ఈ ఆకుల్లో యాంటిఫంగల్, యాంటిసెప్టిక్ సుగుణాలతో పాటు యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. కొత్తిమీర ఆకులకు ముఖం మీద ఉన్న నూనెను పీల్చేసే గుణం ఉంది. ఈ ఆకుల్లోని విటమిన్ సి వల్ల చర్మం మ్రుదువుగా, పట్టులా ఉంటుంది. కొత్తిమీర ఆకులు, పాలు కొద్దిగా కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. లేదా కొత్తిమీర రసాన్ని ముఖానికి రాసుకుని ఒక గంట తర్వాత నీటితో ముఖాన్ని కడిగేసుకోవచ్చు కూడా.


 కొత్తిమీర ఆకు పేస్టు రాసుకంటే చర్మంపై ముడతలు ఏర్పడవు. ఎంతో యంగ్ గా కనిపిస్తారు. అంతేకాదు చర్మంపై మొటిమలు ఏర్పడవు. చర్మం సాగకుండా బిగువుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్తిమీర ఆకు వినియోగం వల్ల వయసు మీద పడ్డ ఛాయలు ఏవీ చర్మంపై కనిపించవు. అలొవిరా జల్, కొత్తిమీర పేస్టు రెండింటినీ కలిపి లేదా కొత్తిమీర, రైస్ రెండింటినీ కలిపి మెత్తగా చేసి ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఈ మిశ్రమంలోని రైస్ చర్మంపై ఉన్న మ్రుతకణాలను పోగొడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.


 కొత్తిమీర ఆకుల పేస్టును పెదాలపై రాసుకుంటే ఎంతో సిల్కీగా, మెరుస్తూ కనిపిస్తాయి. పెదాలపై ఉన్న మ్రుతకణాలను కొత్తిమీర రసం పోగొడుతుంది. రెండు టీస్పూన్ల కొత్తిమీర రసంలో ఒక టీస్పూను నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోయే ముందు పెదాలపై రాసుకుని పడుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే మీ పెదాలు ఎంతో అందంతో మెరిసిపోతాయి.


 ఇక ఆరోగ్య లాభాల కొస్తే, అధికరక్తపోటుతో బాధపడే రోగులను కొత్తిమీర సలాడ్ తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. గుండెజబ్బులకు కూడా ఇది మంచి మందులా పనిచేస్తుంది.


 జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ ఆకులో పీచుపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.


 విటమిన్ ఎ, విటమిన్ సిలు కూడా ఈ ఆకులో ఉన్నాయి. ఇవి కంటి సమస్యలు తలెత్తకకుండా నిరోధిస్తాయి. కళ్లపై ఒత్తిడి పడకుండా సంరక్షిస్తాయి కూడా. కళ్లకు సంబంధించిన పలు మందుల్లో సైతం కొత్తిమీర ఆకును ఉపయోగిస్తారు.

 నోటిదుర్వాసనను కొత్తిమీర తగ్గిస్తుంది. కొత్తిమీర ఆకును ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటిసెప్టిక్ టూత్ పేస్టుల్లో వాడతారు.

 ఆస్టియోపొరాసిస్ వంటి ఎముక సంబంధిత జబ్బుల నివారణలో కూడా కొత్తిమీరను ఉపయోగిస్తారు. ఎముకల సంబంధిత జబ్బులతో బాధపడేవారు నిత్యం తీసుకునే డైట్ లో కొత్తిమీర వాడితే మంచిది. ఇది ఎముకలు బలహీనపడకుండా కాపాడడమే కాకుండా ఎముకల వ్రుద్ధికి కూడా తోడ్పడుతుంది.


 ఎలర్జీలపై బాగా పనిచేసే మూలిక ఇది.

 కొత్తిమీరను రోజూ తినడం వల్ల శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాదు శరీరంలోని చెడు కొలస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News