Saturday, November 15, 2025
Homeహెల్త్Music therapy : సంగీతంతో గుండెకు మేలు.. పాటలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

Music therapy : సంగీతంతో గుండెకు మేలు.. పాటలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

Benefits of listening to music :   బాధలో ఉన్నప్పుడు ఒక పాట వింటే, మనసుకి ఉపశమనం లభిస్తుంది. ఉత్సాహం కావాలంటే ఓ హుషారైన గీతం వింటే చాలు, తెలియని శక్తి వచ్చేస్తుంది. ఇది కేవలం మన అనుభవం మాత్రమే కాదు, దీని వెనుక ఓ పెద్ద సైన్స్ దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. సంగీతం మన చెవుల ద్వారా ప్రయాణించి, నేరుగా మెదడులోని ప్రతి భాగాన్ని తట్టిలేపి, మన ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇంతకీ, ఓ సాధారణ పాట మన గుండెను, మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది..? దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలు ఏమిటి..?

- Advertisement -

మెదడులో సంగీత విన్యాసం : మనం సంగీతం వింటున్నప్పుడు, అది కేవలం శబ్దంగా మెదడులోకి వెళ్లదు. అది ఒక సంకేతాల ప్రవాహంలా మారి మెదడులోని వివిధ కేంద్రాలను ఏకకాలంలో ఉత్తేజపరుస్తుంది.

భావోద్వేగాల కేంద్రం (లింబిక్ సిస్టమ్): మన మెదడులో హిప్పోక్యాంపస్, హైపోథలమస్ వంటి భాగాలతో కూడిన ‘లింబిక్ వ్యవస్థ’ ఉంటుంది. ఇదే మన భావోద్వేగాలకు, జ్ఞాపకాలకు, ప్రవర్తనకు కంట్రోల్ రూమ్ లాంటిది. సంగీతం నేరుగా ఈ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే కొన్ని పాటలు విన్నప్పుడు ఆనందం, మరికొన్ని విన్నప్పుడు దుఃఖం, ఇంకొన్ని విన్నప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.

కదలికలు, ఆలోచనలు (సెరిబ్రల్ కార్టెక్స్): మన మెదడు పైభాగంలో ఉండే బూడిద రంగు పదార్థాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు. సంగీతంలోని లయ, తాళం ఈ భాగాన్ని ప్రేరేపించినప్పుడు మనకు తెలియకుండానే మనం తల ఊపడం, కాళ్లు కదపడం, డ్యాన్స్ చేయాలని అనిపించడం వంటివి జరుగుతాయి. ఇది మన ఆలోచనా శక్తిని, చురుకుదనాన్ని కూడా పెంచుతుంది.

ఆరోగ్యానికి సంగీతం ఎలా మేలు చేస్తుంది : ప్రముఖ అమెరికన్ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) చేసిన అధ్యయనాల ప్రకారం, సంగీతం వినడం వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి.

ఒత్తిడి మాయం, గుండె పదిలం: మంచి సంగీతం విన్నప్పుడు మెదడు ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. రక్తపోటును (బీపీ) నియంత్రణలో ఉంచుతుంది. ఫలితంగా గుండెపై భారం తగ్గి, దాని ఆరోగ్యం మెరుగుపడుతుంది.

జ్ఞాపకశక్తికి పదును: సంగీతం మెదడులోని జ్ఞాపకాల కేంద్రమైన హిప్పోక్యాంపస్‌ను ఉత్తేజపరుస్తుంది. ఇది కొత్త విషయాలు నేర్చుకోవడానికి, పాత విషయాలను గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది.

నైపుణ్యాల మెరుగుదల: సంగీతం మెదడు, శరీరం మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. ఇది చేతులు, కాళ్ల కదలికలను మెరుగుపరచడమే కాకుండా, మెదడులోని వివిధ భాగాల మధ్య అనుసంధానాన్ని బలపరుస్తుంది. కాబట్టి, సంగీతం కేవలం కాలక్షేపం కాదు, అది మన మెదడుకు మేత, మనసుకు ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే ఒక సహజ సిద్ధమైన ఔషధం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad