కరివేపాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ప్రతిరోజు ఉదయం 4-5 తాజా కరివేపాకులను నమలడం వల్ల శరీరానికి ప్రయోజనాలు అనేకం. దీనిని సహజ ఔషధంగా భావిస్తారు. కరివేపాకు ఆకుల్లో విటమిన్ A, కంటి ఆరోగ్యం, రక్తం శుద్ధి, చర్మ సమస్యలు, మధుమేహం నివారణ కోసం ఉపయోగపడతాయి.
కంటి ఆరోగ్యం: కరివేపాకు ఆకులు విటమిన్ A పుష్కలంగా ఉండి, కంటి చూపును మెరుగుపరుస్తాయి. రేచీకటి, కంటి సమస్యలు నివారించడంలో సహాయపడతాయి.
మధుమేహం నియంత్రణ: కరివేపాకు లో ఉన్న హైపోగ్లైసీమిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. ఇది ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చేస్తుంది, మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థకు మేలు: కరివేపాకు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జుట్టు ఆరోగ్యం: కరివేపాకు జుట్టును బలపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న బీటా-కెరోటిన్, ప్రోటీన్ జుట్టు పెరుగుదలకి మద్దతు ఇస్తాయి.
గుండె ఆరోగ్యం: ఇందులో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ- ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలడం వల్ల ఈ ప్రయోజనాలు లభిస్తాయి.