Curry Leaves Water Benefits: కరివేపాకు అనేది అందరి వంటింట్లో ఉపయోగించే ఒక ప్రసిద్ధ మూలిక. దీనిని అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలలో కరివేపాకు లేకుండా వంటలు కూడా చేయరు. కరివేపాకు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే అనేక పోషకాలు ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ఎంతో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, చాలా మంది కరివేపాకులను చేసుకునే వంటలో లేదా ఖాళీ కడుపుతో నమలుతారు. కానీ, ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం.
కరివేపాకులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి దీని నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. ఈ డ్రింక్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో దాని నీటిని తాగడం వల్ల శరీర వ్యవస్థ శుభ్రపడుతుంది. అంతేకూండా ఇది కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే కరివేపాకు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతోపాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ నీటిని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇది మీ కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.
హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉన్న కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అందువల్ల కరివేపాకు నీరు ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు లేదా బలహీనులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకు గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దాని నీరు త్రాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఈ నీరు తాగడం వల్ల గుండె సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కరివేపాకు చర్మాన్ని దెబ్బతీసే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఎంతో సహాయపడుతుంది. అల్పాహారానికి ముందు ప్రతిరోజూ కరివేపాకు నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది సహజమైన మెరుపును ఇస్తుంది. కర్వేపాకు నీరు ఆరోగ్యం, చర్మంతో పాటు జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలడం సమస్య తొలగిపోతుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది.