Mint Tea Benefits: వర్షాకాలంలో వర్షపు చినుకులు పడుతుంటే, ఒక కప్పు వేడి టీ తాగితే ఆ అనుభూతి వర్ణనాతీతం. ఈ సమయంలో వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంతే విధంగా అనేక ఆరోగ్య సమస్యలు కూడా దాడి చేస్తాయి. ఈ సీజన్‌లో తరచుగా తేమతో, జీర్ణ సమస్యలు, జలుబు, కడుపులో గ్యాస్, అజీర్ణం, ఇన్ఫెక్షన్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరుతాయి. ఇటువంటి పరిస్థితిలో పుదీనా టీ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ టీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పుదీనా టీ అటువంటి రుతుపవనాల దివ్యౌషధం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే, ఇప్పుడు వర్షాకాలంలో పుదీనా టీ ఎందుకు తాగాలి? దానిని తయారు చేయడానికి సరైన మార్గం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థ
వర్షాకాలంలో తరచుగా కడుపు సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఈ సమయంలో పుదీనా టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది. పుదీనా ఒక సహజ జీర్ణ మూలిక. ఇందులో ఉండే అంశాలు గ్యాస్, అజీర్ణం, వాపు వంటి సమస్యలను తొలగిస్తుంది.
రోగనిరోధక శక్తి
పుదీనా టీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం
వర్షాకాలంలో చల్లని గాలి, మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తరచుగా గొంతు నొప్పి, జలుబు రావడం సర్వసాధారణం. ఈ సమయంలో పుదీనా టీ తాగడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పానీయం శ్వాసకోశ మార్గాన్ని తెరచి పశమనాన్ని అందిస్తుంది.
Also Read: Health Tips: హెల్తీ గా ఉండాలంటే పొద్దున్నే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసా..?
ఒత్తిడి, అలసట నుండి ఉపశమనం
పుదీనా సువాసన, తాజాదనం వర్షాకాలంలో నీరసంగా ఉన్న మనస్సును ప్రశాంతపరుస్తుంది. మానసిక స్థితిని సైతం రిఫ్రెష్ చేస్తుంది.
చర్మ ఆరోగ్యం
వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్, చెమట అలెర్జీ వంటి చర్మ సమస్యలు తరచుగా రావడం సర్వసాధారణం. ఈ టైమ్ లో పుదీనా టీ తాగడం ఎంతో మంచిది. ఇందులో ఉండే డీటాక్స్ లక్షణాలు శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తాయి.
పుదీనా టీ ఎలా తయారు చేయాలి?
కావాల్సిన పదార్థాలు:
తాజా పుదీనా ఆకులు – 10
నీరు – 2 కప్పులు
అల్లం – ½ టీస్పూన్
తేనె లేదా బెల్లం – రుచికి సరిపడా
నిమ్మరసం – ½ టీస్పూన్
తయారు చేసే విధానం:
స్టవ్ ఆన్ చేసి ఒక పాన్‌లో నీరు మరిగించాలి. కొద్దిసేపు తర్వాత మరుగుతున్న నీరులో అల్లం, పుదీనా ఆకులు వేయాలి. ఇవి నీటిలో బాగా కలిసిపోయేలా దాదాపు 5-7 నిమిషాలు పాటు తక్కువ ఫ్లేమ్ లో మరిగించాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. రుచి కోసం ఇందులో తేనె లేదా బెల్లం జోడించవచ్చు. కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం కూడా జోడించవచ్చు.


