Tomato Soup Benefits: చలికాలంలో రాత్రిపూట బౌల్ గరం టమోటా సూప్ తాగడం నోటికి రుచిగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే? టమోటాలలోని లైకోపీన్, విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యం, చర్మం సంబంధిత సమస్యలు, కంటి ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ టమోటా సూప్ తాగడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా జలుబు, కొలెస్ట్రాల్, అనేక ఇతర వ్యాధులను నివారించవచ్చు. రుచి, ఆరోగ్యం రెండింటికీ పవర్ టానిక్‌గా సహాయపడే ఈ టమోటా సూప్ ఈ శీతాకాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ క్రమంలో టమోటా సూప్ లో ఉండే పోషకాలు ఏంటి? చలికాలంలో టమోటా సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
also read:Weight Loss Fruits: కేలరీలు తక్కువగా ఉండే పండ్లు ఇవే..తింటే కొవ్వు ఇట్టే కరుగుతుంది!
టొమాటో సూప్‌లోని ఉండే పోషకాలు
ప్రోటీన్: 3.08 గ్రాములు
ఫ్యాట్స్: 11.9 గ్రాములు
కార్భోహైడ్రేట్స్:16.3 గ్రాములు
ఫైబర్: 2.55 గ్రాములు
కాల్షియం: 48.4 మి.గ్రా
మెగ్నీషియం: 25.5 మి.గ్రా
పొటాషియం: 469 మి.గ్రా
విటమిన్ సి: 15.3 మి.గ్రా
బీటా-కెరోటిన్: 959 మైక్రోగ్రాములు
విటమిన్ ఇ: 1.84 మి.గ్రా
లుటీన్, జియాక్సంతిన్: 110 మైక్రోగ్రాములు
అలాగే ఈ టమోటా సూప్ లో కోలిన్, సెలీనియం, విటమిన్ కె, లైకోపీన్, రెటినోల్, విటమిన్ ఎ, భాస్వరం, ఇనుము వంటి ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవ్వన్నీ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె, చర్మం, కంటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.
చలికాలంలో టొమాటో సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
యాంటీఆక్సిడెంట్ల శక్తి: కొన్ని నివేదికల ప్రకారం..టమోటా సూప్‌లో ఉండే లైకోపీన్, ఫ్లేవనాయిడ్లు, విటమిన్లు C, E వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. అంటే టమోటా సూప్ మధుమేహం, గుండె జబ్బులు, మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ రక్షణ: లైకోపీన్ టమోటాలకు ఎరుపు రంగును ఇస్తుంది. క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడుతుంది. లైకోపీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొత్తం క్యాన్సర్ ప్రమాదం 5–11% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం కూడా దాదాపు 28% తగ్గుతుంది. టమోటా సూప్‌లో ఉండే బీటా, ఆల్ఫా కెరోటిన్‌లు కూడా ఈ ప్రభావానికి దోహదం చేస్తాయి.
also read:Fiber Rich Fruits: శరీరానికి అవసరమైన ఫైబర్ అందించే పండ్లు ఇవే!
చర్మం, కంటి ఆరోగ్యం: శీతాకాలపు చల్లని గాలి చర్మాన్ని పొడిబారిస్తుంది. అయితే, టమోటా సూప్ దీనికి ఒక పరిష్కారం చూపుతుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్, లైకోపీన్ చర్మాన్ని UV నష్టం నుండి రక్షిస్తాయి. అలాగే లుటిన్, జియాక్సంతిన్ కళ్ళను రక్షిస్తాయి. ఇది హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేస్తుంది.
గుండె ఆరోగ్యం: టమోటా సూప్ గుండెకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మొత్తం LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. HDL కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపరుస్తుంది. లైకోపీన్ పేగులో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
రోగనిరోధక శక్తి: చలికాలంలో జలుబు, ఫ్లూను నివారించడానికి టమోటా సూప్ తాగడం బెస్ట్. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు లక్షణాలను నివారిస్తుంది. అంటే ఇది రుచికరమైనది మాత్రమే కాదు, శరీరం అనారోగ్యంతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

