Raw Garlic On Empty Stomach: ఆహార రుచిని పెంచడమే కాకుండా అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఆహార పదార్థాలు మన వంటింట్లో ఎన్నో ఉన్నాయి. అందులో పచ్చి వెల్లుల్లి ఒకటి. ఇది దాదాపు అందరి వంట గదిలో ఉంటుంది. చాలామందికి పచ్చి వెలుల్లి, అల్లం కలిపి మిక్స్ చేసి కూరల్లో జోడిస్తుంటారు. కానీ,పచ్చి వెలుల్లి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియకపోవచ్చు. పచ్చి వెల్లుల్లి తినడం శరీరానికి ఒక వరంలా పనిచేస్తుంది. ముఖ్యంగా, ప్రతిరోజూ ఖాళీ కడుపుతో నమిలితే దీనికి లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, పచ్చి వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏమిటో తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో 7 రోజులు పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది
నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, గంటల తరబడి ఒకే చోట కూర్చొని వర్క్ చేయడం, వ్యాయామం చేయకపోవడం కొలెస్ట్రాల్ స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. ఇందుకొసం వెల్లుల్లి ఎంతో ప్రయోజనరకరంగా ఉంటుంది. వెలుల్లిలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే గుణాలు ఉంటాయి. కాబట్టి, పచ్చి వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్త కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. పని తీరు సైతం మెరుగుపడుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది
ఇటీవల కాలంలో అధిక రక్తపోటు సర్వసాధారణం అయిపోయింది. అధిక రక్తపోటు ఉంటె వెల్లుల్లి ప్రభావవంతమైన నివారణగా పనిచేస్తుంది. వెల్లుల్లిలోని ఉండే అల్లిసిన్ కంటెంట్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గించి,
సాధారణ హృదయ స్పందనను నిర్వహిస్తుంది.
మొటిమలను తగ్గిస్తుంది
చర్మ సమస్యలు ముఖ్యంగా, మొటిమలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. వెల్లుల్లిలో చర్మంపై బ్యాక్టీరియాను నాశనం చేసే, మొటిమలను నయం చేసే సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. మొటిమలతో బాధపడుతున్నవారు ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం చాలామంచిది.
ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం
పచ్చి వెల్లుల్లి ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఒక వరం లాంటిది. వెల్లుల్లిలో కనిపించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ నొప్పికి ప్రధాన కారణమైన మంటను తగ్గిస్తాయి. పచ్చి వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలు మెరుగుపడతాయి. నొప్పి తగ్గుతుంది.
పచ్చి వెల్లుల్లిని ఎలా తినాలి?
వెల్లుల్లి బలమైన రుచి, వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని నేరుగా తినడం చాలా కష్టం అవుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజు ఒక వెల్లుల్లి తినాలంటే మొదటి రోజు నుంచి సగం పచ్చి వెల్లుల్లి రెబ్బతో మొదలుపెట్టాలి. క్రమంగా రెబ్బ వరకు తినే అలవాటు చేసుకోవాలి. ఇలా కూడా తినడానికి కష్టమవుతుంటే పచ్చి వెల్లుల్లి చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి తినవచ్చు. పచ్చి వెల్లుల్లి వాసన పడకుంటే దానిని కొద్దిసేపు నీటిలో నానబెట్టి కూడా నమలవచ్చు.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

