Saturday, November 15, 2025
Homeహెల్త్Apricot: గ్యాస్​ ట్రబుల్​ నుంచి బీపీ దాకా..ఎన్నో సమస్యలకు ఈ ఫ్రూట్​తో చెక్ పెట్టండి..

Apricot: గ్యాస్​ ట్రబుల్​ నుంచి బీపీ దాకా..ఎన్నో సమస్యలకు ఈ ఫ్రూట్​తో చెక్ పెట్టండి..

Apricot Benefits: ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ హెల్దీ ఫుడ్​ తీసుకోవాలి. అలాగే వ్యాయామం చేస్తుండాలి. అయితే, నేటి బిజీ లైఫ్ కారణంగా చాల మంది వ్యాయామం చేయడం లేదు. ఇక నోటి రుచి కోసం సరికదా జంక్ ఫుడ్‌ను అధికంగా తీసుకుంటున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, హెల్దీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి వాటిల్లో ఆప్రికాట్స్ ఒకటి. దీని ఉదయాన్నే తీసుకోవడం వల్ల అనేక లాభాలు పొందొచ్చు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ క్రమంలో ప్రతిరోజూ ఆప్రికాట్స్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

కంటి చూపు:
ఆప్రికాట్స్‌లో విటమిన్-ఎ, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ విటమిన్లు కంటి చూపును మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. వృద్ధాప్యం వల్ల కలిగే కంటి సమస్యలను కూడా నివారిస్తుంది. ఆప్రికాట్స్‌ క్రమం తప్పకుండా తినడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. దేనైనా స్పష్టంగా చూడవచ్చు.

.

గుండె ఆరోగ్యం:
ఆప్రికాట్స్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండెకు చాలా ముఖ్యమైనవి. ఈ అంశాలు రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా, ఆప్రికాట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Also Read:Health: మీకు ఉదయాన్నే ఈ అలవాట్లు ఉన్నాయా..?

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
ఆప్రికాట్స్‌ ఫైబర్ యొక్క మంచి మూలం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. ఫైబర్ ప్రేగులను శుభ్రంగా ఉంచుతుంది. వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. దీనితో పాటు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ప్రేగుల వాపును తగ్గిస్తాయి. వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా!

రోగనిరోధక శక్తి:
ఆప్రికాట్స్‌లో ఉండే విటమిన్-సి, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి శరీరానికి ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి బలాన్ని ఇస్తాయి. ఆప్రికాట్స్‌ తినడం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరుస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు.

చర్మ ఆరోగ్యం:
ఆప్రికాట్స్‌లో ఉండే విటమిన్-ఎ, విటమిన్-సి చర్మ కాంతిని పెంచడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా, ఆప్రికాట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఆప్రికాట్స్‌ క్రమం తప్పకుండా తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. చర్మం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad