Black raisins Benefits: మన డైట్ లో డ్రై ఫ్రూట్స్ ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. అయితే, డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన నల్ల ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. దీని కారణంగానే నల్ల ఎండుద్రాక్షను సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. శరీరంలో రక్తాన్ని పెంచే ఈ డ్రై ఫ్రూట్ రక్తహీనత రోగులకు దివ్యౌషధం కంటే తక్కువ కాదు. దీన్ని తినడం వల్ల ఎముకలు కూడా బలపడతాయి. నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, సహజ చక్కర పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరాన్ని లోపల నుండి బలోపేతం చేస్తుంది. ఈ క్రమంలో నలైన ద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఈ డ్రై ఫ్రూట్ ఐరన్ అద్భుతమైన మూలం. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇది రక్తహీనత రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా నల్ల ఎండు ద్రాక్షలను మహిళలు, టీనేజ్ అమ్మాయిలు తమ ఆహారంలో చేర్చుకోవాలి.
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీన్ని తినడం వల్ల మలబద్ధకం లేదా అజీర్ణం అంటే సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉదయాన్నే నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్షలు కడుపుని క్లీన్ చేసి, విష పదార్థాలను బయటికి పంపిస్తాయి.
Also Read:Health News: కుక్కర్‌లో వండి తింటున్నారా? ఇక ఒళ్లంతా విషమే!!
నల్ల ఎండు ద్రాక్షలో ఎముకలను బలోపేతం చేయడానికి అవసరమైన కాల్షియం, బోరాన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అస్టియో పోరోసిస్ ను నివారించడంలో సహాయపడుతాయి. ఇవి పిల్లలు, వృద్ధులు లకు అద్భుతమైన సహజ సప్లిమెంట్.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి సహజమైన మెరుపుని అందిస్తాయి. ఇవి ఆకాల ముడతలను సైతం తగ్గిస్తాయి. నల్ల ఎండ ద్రాక్షలో తినడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు ఇది జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నల్ల ఎండు ద్రాక్షలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు అంటే సాధారణ వ్యాధులతో పోరాడటానికి బలాన్ని ఇస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


