Saturday, November 15, 2025
Homeహెల్త్Curd Rice: పెరుగన్నం ఆరోగ్య లాభాలు తెలిస్తే..ఈరోజునుంచే తింటారు!

Curd Rice: పెరుగన్నం ఆరోగ్య లాభాలు తెలిస్తే..ఈరోజునుంచే తింటారు!

Curd Rice Benefits: పెరుగన్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక సాంప్రదాయ ఆహార వంటకం. ముఖ్యంగా దీని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా తింటారు. చాలా మంది పెరుగన్నం రుచి కోసం తిన్న, దీని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతం. పెరుగు అన్నాన్ని పిల్లలు, పెద్దలు తినడానికి బాగా ఇష్టపడుతారు. తరచుగా పెరుగన్నం తింటే శరీరాన్ని చల్లబరిచి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

- Advertisement -

పెరుగులోని ప్రోబయోటిక్స్, అన్నంలో కార్బోహైడ్రేట్లు కలిసి శరీరాన్ని పోషించడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇది రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే? దీనిని తయారు చేయడం సులభం! ఈ క్రమంలో పెరుగన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పెరుగన్నంలో లభించే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. ఇవి సరైన జీర్ణక్రియను నిర్వహిస్తాయి. దీని తినడం వల్ల కడుపు ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు, పెరుగన్నం కడుపు నొప్పి, గ్యాస్, ఆమ్లత్వం లేదా మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది: పెరుగన్నం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో దీని తింటే శరీరం చల్లబడుతుంది. హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. అధిక ఒత్తిడి లేదా అలసటను ఎదుర్కొంటున్నవారు ఈ ఆహారాన్ని తీసుకోవాలి. ఇది వారికి సహజ శక్తినిచ్చేదిగా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తి: రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటె పెరుగన్నం తినవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే కాల్షియం, విటమిన్ బి12, జింక్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతాయి. ప్రతిరోజూ పెరుగన్నం తినడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అనేక ఇతర రోగాల దరిచేరవు.

చర్మం, జుట్టుకు ప్రయోజనాలు: పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అన్నం అవసరమైన కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. ఇది చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కలయిక లోపలి నుండి పోషణను అందిస్తుంది.

మానసిక స్థితి, నిద్ర: పెరుగన్నం తిన్న తర్వాత ప్రశాంతత, రిఫ్రెష్ అనుభూతి కలుగుతుంది. ఈ ఫుడ్ మెదడులోని సెరోటోనిన్ హార్మోన్‌ను సక్రియం చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది.

బరువు అదుపులో: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు పెరుగు అన్నం తింటే మంచిది. ఎందుకంటే ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో పదే పదే తినే అలవాటును నివారించవచ్చు. పెరుగులో ఉండే ప్రోటీన్, క్యాల్షియంలు ఆకలిని నియంత్రిస్తాయి.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad