Pears Fruits Benefits: వేసవి కాలంలో లభించే జ్యుసి, రుచికరమైన పండ్లలో పియర్ ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఆకుపచ్చ-పసుపు రంగులో ఉండే ఈ పండు తినడానికి రుచికరంగా ఉండడమే కాకుండా ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతాయి. ఆయుర్వేదంలో పియర్స్ పండ్లును జీర్ణశక్తిని మెరుగుపరిచే, రోగనిరోధక శక్తిని పెంచే పండుగా పరిగణిస్తారు.
ఈ పండును క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా గుండె, చర్మం, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే, ఇప్పుడు పియర్స్ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
పియర్స్ పండ్లలో చాలా డైటరీ ఫైబర్ ఉంటుంది. కావున ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపును శుభ్రంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజూ పియర్ పండును ఆహారంలో చేర్చుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయి.
Also read: Weight Loss Drink: రాత్రి పడుకునే ముందు ఈ 5 డ్రింక్స్ తాగితే చాలు.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..
ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఈ పండులో కనిపించే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి.
అందంగా కనిపించాలనుకునేవారు ఈ పండును తినాలి ఎందుకంటే ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. అంతేకాకుండా ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. పేస్ పై ఉన్న మచ్చలను తగ్గిస్తుంది. ఎముకలు బలహీనంగా ఉన్నవారు వీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే బోరాన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇది ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు దీనిని తమ ఆహారంలో చేర్చుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో అతిగా తినడం మానేస్తాం.