Pumpkin Seeds Benefits: రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తున్నారా? అదే ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో 10 నానబెట్టిన గుమ్మడికాయ గింజలను తింటే? ఆరోగ్యానికి ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు అందిస్తాయి. పవర్ హౌస్ గా పిలవబడే గుమ్మడికాయ గింజలు ఉదయాన్నే తింటే రోజు మొత్తం ఎంతో శక్తివంతంగా ఉండవచ్చు. ఇవి గుండె ఆరోగ్యం నుంచి చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే వరకు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఎముకలు సైతం బలపడతాయి. ఈ క్రమంలో ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం.
గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు, ఇది నార్మల్ హార్ట్ బీట్ ను నిర్వహించడంలో సహాయపడుతుంది. హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇప్పటికే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి గుమ్మడికాయ గింజలు ఒక వరం. వీటిలో ఉండే ట్రిప్టో పాన్ శరీరంలో సెరోటోనిన్ మేలాటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీంతో నిద్ర బాగా పడుతుంది. ప్రతి ఉదయం గుమ్మడికాయ గింజలు తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
Also Read:Tea and Coffee for Health: టీ కాఫీ.. అమృతం కావాలంటే… సరైన పద్ధతి ఇదే!
ఎముకలు బలహీనంగా ఉన్నవారికి గుమ్మడికాయ గింజలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఉండే జింక్, మెగ్నీషియం, భాస్వరం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు, ఇది అస్టియోపోరోసిస్ ని నివారించడంలో సహాయపడుతుంది.
వీటిలో ఉండే జింక్, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి జలుబు, ఇతర వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి.
గుమ్మడికాయ గింజలు డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చు. ఇది శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు చక్కర స్థాయిలను పెరగకుండా నిరోధించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
గుమ్మడికాయ గింజలు ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?
రాత్రి పడుకునే ముందు 10 లేదా అంతకంటే ఎక్కువ గుమ్మడికాయ గింజలను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఈ గింజలను ఖాళీ కడుపుతో నమలాలి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


