Saturday, November 15, 2025
Homeహెల్త్Dates: వీటిని పాలలో నానబెట్టి తింటే ఆ సమస్యలన్నీ ఖతమే..!

Dates: వీటిని పాలలో నానబెట్టి తింటే ఆ సమస్యలన్నీ ఖతమే..!

Soaked Dates in Milk: ఖర్జూరం పోషకాలతో సమృద్ధిగా ఉండే డ్రై ఫ్రూట్. దీన్ని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, మీకు తెలుసా..? ఖర్జూరాలను పాలలో నానబెట్టి తింటే దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయని! నిజమే..పాలు, ఖర్జూరాల కాంబినేషన్ శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. అంతేకాకుండా అనేక వ్యాధులను దూరం చేస్తాయి. రాత్రిపూట పాలలో 2-3 నానబెట్టిన ఖర్జూరాలు తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ప్రతిరోజు పాలలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

- Advertisement -

ఖర్జూరంలో గ్లూకోజ్, ప్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే, పాలలో ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడతాయి. అందువల్ల ఉదయం అల్పాహారంలో పాలలో నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు.

పాలు కాల్షియం మంచి మూలం. ఖర్జూరంలో మెగ్నీషియం, సెలీనియం, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తద్వారా పాలల్లో నానబెట్టిన ఖర్జూరాలను తింటే ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతాయి.

Also Read: Health Tips: హెల్తీ గా ఉండాలంటే పొద్దున్నే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసా..?

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవాలి. ఎందుకంటే ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. దీంతోపాటు మలబద్దకాని అని కూడా తగ్గిస్తుంది. పాలలో ఉండే ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందువల్ల పాలలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల కడుపు సమస్యలు తొలగిపోతాయి.

ఖర్జూరాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడుతుంది. అందువల్ల ఐరన్ లోపం ఉన్నవారు ఖర్జూరాలు తినడం ఎంతో ప్రయోజనకరం.

ఈ కాంబినేషన్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే పాలలో ఉండే మెగ్నీషియం ధమనులును సరళంగా మార్చడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఖర్జూరాలలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలల్లో జింక్ విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడుతాయి. ఇది జలుబు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం ఉత్తమం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad