Sweet Potato Benefits: చిలగడదుంప ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. చిలగడదుంపను ఉడకబెట్టడం, వేయించడం లేదా చాట్ చేయడం ద్వారా ఏ విధంగానైనా మనం ఆహారంలో చేర్చుకోవచ్చు. చాలామంది దీని చిరుతిండిగా తింటారు కూడా! ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. తద్వారా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఈ క్రమంలోనే చిలగడదుంప తినడం వల్ల కలిగే ప్రయోజనాల ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
చిలగడదుంప తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
చిలగడదుంప ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతోపాటు ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని సైతం బలంగా ఉంచుతుంది. దీనిలో ఉండే పిండి పదార్ధం పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. దీనిని ఆరోగ్యకరమైన చిరుతిండిగా తినడానికి ఇదే కారణం.
Also Read: Dark Circles: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. కళ్ల కింద నల్లటి వలయాలు మాయం!
ఇందులో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక విటమిన్ సి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. చిలగడదుంప తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
చాలామంది బరువు తగ్గడానికి చిరుతిళ్లు తినకుండా ఉంటారు. కానీ, చిలగడదుంప ఆరోగ్యకరమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇది తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది అతిగా తినకుండా నివారిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటానికి చిలగడదుంప ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. ఇది నెమ్మదిగా గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. డయాబెటిస్ రోగులు దీనిని తినడం ద్వారా శక్తిని పొందవచ్చు.
చిలగడదుంపలలో ఉండే బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. దీనితో పాటు, విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని కారణంగా ముఖం పై ముడతలు, వృద్ధాప్య సంకేతాలు దూరం చేస్తుంది. అంతేకాదు ఇది జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


