Sunday, November 16, 2025
Homeహెల్త్Orange Peel: నారింజ తొక్కతో ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిస్తే.. బయటకు అస్సలు పడేయరు!

Orange Peel: నారింజ తొక్కతో ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిస్తే.. బయటకు అస్సలు పడేయరు!

Orange Peel Benefits: సాధారణంగా చాలామంది నారింజ పండు తిని వాటి తొక్కలను పడేస్తుంటారు. కానీ వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఎవరికి తెలియదు. నారింజ తొక్కలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు, వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరం అనేక వ్యాధులతో పోరాడటానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నారింజ తొక్కలను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ కధనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

- Advertisement -

జీర్ణక్రియకు ప్రయోజనకరమైనది:

నారింజ తొక్కలు జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరమైనవి. వాటిలో ఉండే ఫైబర్ కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతాయి. అంతేకాదు, ఈ తొక్కలు మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి అనేక రకాల జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ తొక్కలను తినడం జీర్ణక్రియను మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యం:

ఈ తొక్కలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో ఉండే కొన్ని అంశాలు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. దీనితో పాటు ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

రోగనిరోధక శక్తి

నారింజ తొక్కలలో ఉండే విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ తొక్కలు శరీరంలోని మూలకాల స్థాయిని పెంచుతాయి. ఇవి కణాలను దెబ్బతీసే మూలకాలతో పోరాడటానికి సహాయపడుతాయి. దీనితో పాటు, ఇవి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

 

బరువు నియంత్రణ:

అధిక బరువు ఉండి, బరువును నియంత్రించాలనుకుంటే నారింజ తొక్కను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అదనంగా ఫైబర్ శరీరం శక్తి వినియోగ వేగాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

దంతాలు:

నారింజ తొక్కను దంత సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఇందులో దంతాల ఉపరితలంపై మరకలను తొలగించగల ఒక మూలకం ఉంటుంది. దీంతో దంతాలు ఆరోగ్యాంగా ఉంటాయి. దీనితో పాటు దీనిలో ఉన్న లక్షణాలు దంత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అయితే, దంతాలను శుభ్రం చేయడానికి నారింజ తొక్కను ఉపయోగించే ముందు దంతవైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad