చాలా మంది బొప్పాయిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ పండును తరచుగా తీసుకుంటే మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. బొప్పాయిలో ఎ, బి, సి, ఇ, కె వంటి పలు విటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే చాలా మంది బొప్పాయి తింటుంటారు. అయితే వాటి విత్తనాలను మాత్రం పారేస్తుంటారు. ఈరోజు మనం బొప్పాయి విత్తనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
బొప్పాయిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ పండును తరచుగా తీసుకుంటే మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. బొప్పాయిలో ఎ, బి, సి, ఇ, కె వంటి పలు విటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. అయితే చాలా మంది బొప్పాయి విత్తనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియక వాటిని బయట పడేస్తుంటారు. బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, టానిన్లు, సపోనిన్‌లకు మంచి మూలం అని పశ్చిమబెంగాల్ కు చెందిన డాక్టర్ బిశ్వజిత్ సర్కార్ పేర్కొన్నారు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయని పేర్కొన్నారు.
బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే కార్పైన్ మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా మరియు పరాన్నజీవులను తొలగించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయి గింజల్లో ఒలియిక్ యాసిడ్ వంటి మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అందుకే బొప్పాయి గింజలు తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెపుతుంటారు.
అంతేకాదు బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది వివిధ రకాల క్యాన్సర్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. దీనితో పాటు ఇందులో ఉండే ఐసోథియోసైనేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందంట. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ విత్తనం చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయని వైద్యులు అంటున్నారు. ఈ విత్తనాలు రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని వివిధ వ్యాధుల నుంచి గుండెను రక్షిస్తాయని చెపుతున్నారు.
విటమిన్ సి మరియు ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ మరియు పాలీఫెనాల్స్ వంటి గింజల్లో పుష్కలంగా ఉండటం వల్ల.. ఇవి నొప్పిని తగ్గిస్తాయి. ఫలితంగా కీళ్లనొప్పులు, రుమాటిజం మొదలైన వాటి నొప్పులను నివారించడంలో ఈ విత్తనాలు ప్రధాన పాత్ర పోషిస్తుందంట. బొప్పాయి గింజల్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. దీని కారణంగా ఈ గింజలు తినడం వల్ల ముఖం కాంతి వంతంగా మారుతుంది. అంతే కాకుండా చర్మంపై ముడతలను కూడా తొలగిస్తుంది. అంతేకాకుండో వీటిలో ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్, షిగెల్లా డైసెంటరీ, సాల్మొనెల్లా టైఫీ, సూడోమోనాస్ ఎరుగినోసా, ఎస్చెరిచియా కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియా నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి.