Sunday, February 8, 2026
Homeహెల్త్Potato Peel: తొక్కలో ఏముందని తీసి పారేస్తున్నారా..? ఆరోగ్య లాభాలు తెలిస్తే ఆలా చేయరు..

Potato Peel: తొక్కలో ఏముందని తీసి పారేస్తున్నారా..? ఆరోగ్య లాభాలు తెలిస్తే ఆలా చేయరు..

Potato Peel Benefits: సాధారణంగా బంగాళదుంప వంటకాలు చేసేటప్పుడు పీలర్ తో తొక్కలు తీసి డస్ట్ బిన్ లో పడేస్తుంటాం. వ్యర్థంగా పరిగణించబడే బంగాళదుంప తొక్కలు అనేక పోషకాలు కలిగి ఉంటాయి. ఇన్ని రోజులు బంగాళదుంప తొక్కలను వేస్ట్ అనుకుంటున్న పొట్టు లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ప్రయోజనాలు బాగున్నాయి. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, జీర్ణ క్రియ, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ క్రమంలో బంగాళదుంప తొక్కల్లో ఉన్న పోషకాల నిధి ఏంటి? ఇది మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడతాయో స్టోరీలో తెలుసుకుందాం.

- Advertisement -

బంగాళాదుంప తొక్కలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహించడానికి సాయపడుతుంది. అలాగే, రక్తపోటును నియంత్రిస్తుంది. సరైన కండరాలు, నరాల పనితీరును ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

ఈ తొక్కలలోని ఆహార ఫైబర్ జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, కరగని ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పెద్దప్రేగును శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది.

also read:Lava Blaze Duo 3: డ్యూయల్ డిస్‌ప్లేతో లావా బ్లేజ్ డుయో 3..లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

బంగాళాదుంప తొక్కలలో ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలోని కొన్ని సమ్మేళనాలు వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

వీటి ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ కారణంగా బంగాళాదుంప తొక్కలు బరువు నియంత్రణకు ప్రయోజనకరంగా ఉంటాయి. రక్తంలో చక్కెర నియంత్రణలో కూడా సహాయపడతాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు కూడా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

కాబట్టి, తదుపరిసారి బంగాళాదుంపల తొక్కలను శుభ్రం చేసి తొక్కతో పాటే ఉడకబెట్టి కూరల్లో వాడవచ్చు లేదా తొక్కతో సహా బేక్ చేయొచ్చు. వెరైటీగా కావాలంటే తొక్కలను వేరు చేసి వాటికి కాస్త నూనె, మసాలా దట్టించి ఓవెన్‌లో పెడితే ‘క్రిస్పీ పీల్ చిప్స్’లా కూడా తినొచ్చు. సాధ్యమైతే ‘ఆర్గానిక్’ దుంపలు కొనడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News