Vitamin D Benefits: విటమిన్ డి అనేది శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలలో ఒకటి. సాధారణంగా విటమిన్ డి సూర్యరశ్మి నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ విటమిన్ డి ఎముకలను దృఢంగా చేయడంలో, మానసిక స్థితిని పెంచడంలో, రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. విటమిన్ డి వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? దీని ఎలా పొందవచ్చు అనే విషయాలు మనం తెలుసుకుందాం.
విటమిన్ డి వల్ల కలిగే ఆరోగ్య లాభాలు:
విటమిన్ డి ఎముకలను బలంగా తయారు చేస్తుంది. ఇది దంతాల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. విటమిన్ డి తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారుతాయి. దీని వల్ల కీళ్ళ నొప్పులు, పంటి నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లలలో విటమిన్ డి లోపిస్తే ఎముకలు వంకరగా అవుతాయని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి లోపం వల్ల వృద్ధులలో ఎముక పగుళ్లకు దారి తీస్తుంది. కాబట్టి విటమిన్ డి ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది.
రోగనిరోధక శక్తి ని మెరుగుపరచడంలో విటమిన్ డి ముఖ్య ప్రాతను పోషిస్తుంది. ఇది అనారోగ్యసమస్యలు, అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే విటమిన్ డి ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో సహాయపడుతంది. ఓ అధ్యయనాల ప్రకారం విటమిన్ డి ఆటోఇమ్యూన్ వ్యాధులను నియంత్రిస్తుంది చెబుతున్నాయి. అంతేకాకుండా విటమిన్ డి కండరాల పనితీరుకు చాలా అవసరం. అతి ముఖ్యంగా వృద్ధులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరచడంలో, మెదడు వేగంగా పని చేయడంలో ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే విటమిన్ డి కలిగిన ఆహారపదార్థాలను తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. విటమిన్ డి గుండె పోటు ప్రమాదాని తగ్గిస్తుంది.
క్యాన్సర్ వ్యాధిని తగ్గించడంలో కూడా విటమిన్ డి సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను పూర్తిగా నాశనం చేస్తుందని కొన్ని వైద్య అధ్యాయనాలు సూచిస్తున్నాయి. అధిక బరువు తగ్గించడంలో కూడా విటమిన్ డి సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
విటమిన్ డి ఎలా పొందవచ్చు:
పుట్టగొడుగులు, గుడ్డు సొనలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. అలాగే పాలు, పెరుగు వాటిలో కూడా విటమిన్ డి ఉంటుంది కాబట్టి వీటిని మీరు డైట్ లో చేర్చుకోండి. ప్రతిరోజు ఉదయం 30 నిమిషాల పాటు సూర్యరశ్మిలో గడపడండి. ఆరోగ్యనిపుణుడిని సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లు తినండి. ఈ విధంగా చేయడం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుంది.