Health Effects of Palak Paneer: ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలలో పన్నీర్ ఒకటి. పూర్తి శాకాహారంలో ఉండే పన్నీర్.. ముక్కలు ముక్కలుగా మాంసం మాదిరిగా ఉంటుంది. అందుకే, మాసం తినని శాకాహారులు పన్నీర్‌ని తెగ ఇష్టపడుతుంటారు. పన్నీర్ రుచిలోనే కాదు పోషకాల్లోనూ ముందుంటుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే, కొన్ని ఆహార పదార్థాలతో కలిపి పనీర్‌ను తీసుకోవడం హానికరం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి వాటిలో పాలకూర కూడా ఒకటి. భారతీయ వంటకాల్లో ప్రసిద్ధి చెందిన పాలక్ పన్నీర్ కాంబినేషన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు హెచ్చరిస్తున్నారు. దీనికి గల ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.
పాలక్ పనీర్‌తో జీర్ణ సమస్యలు..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పన్నీర్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో పాలకూరలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ రెండు పోషకాలను శరీరం ఒకేసారి సమర్థవంతంగా గ్రహించలేదు. కాల్షియం ఎక్కువగా ఉన్నప్పుడు.. అది ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల శరీరానికి ఈ రెండింటి ప్రయోజనాలు పూర్తిగా అందవని నిపుణులు చెబుతున్నారు. పాలక్ పన్నీర్‌ను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు కూడా హానికరమని హెచ్చరిస్తున్నారు. కాల్షియం, ఐరన్ రెండింటినీ ఒకేసారి జీర్ణం చేయడం కష్టం. కాబట్టి, దీని వలన అసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇది మరింత తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను సరిగా గ్రహించలేదు. దీని ఫలితంగా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడి.. రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్ పడిపోయే ప్రమాదం ఉంది. ఇది క్రమంగా రక్తహీనతకు దారితీస్తుంది. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. పనీర్‌లో కాల్షియం ఉంటుంది. ఈ రెండూ కలిసినప్పుడు ఆక్సాలిక్ యాసిడ్ కాల్షియంతో చర్య జరిపి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి పరోక్షంగా కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ సమస్యలన్నిటినీ నివారించడానికి పాలకూర, పన్నీర్‌ను ఒకే భోజనంలో కాకుండా వాటిని వేరు వేరు సమయాల్లో తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
పన్నీర్‌తో ప్రయోజనాలివే..
అయితే, పన్నీర్ తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పన్నీర్ తినడం ద్వారా త్వరగా ఆకలి వేయదు. ఆహారం మితంగానే తీసుకుంటారు. దీంతో బరువు తగ్గుతారు. ఇందులో పోషకాలు ఎక్కువ. రోజూ ఆహారంలో పన్నీర్‌ను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ 50 గ్రాముల పన్నీరును తింటే భవిష్యత్‌లో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. పన్నీర్ తినడం వల్ల దంతక్షయం సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.పన్నీర్ తినడం వల్ల మధుమేహం బారిన పడకుండా ఉండవచ్చు. దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.


