Health Tips for Night Sleep: రోజంతా యాక్టీవ్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వారికి ఉండే కొన్ని అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా రాత్రిపూట సరిగ్గా నిద్రపోరు. దీంతో, ఉదయం నీరసంగా, అయాసపడుతూ ఉంటారు. నిద్ర లేకపోవడం, జీవనశైలి సరిగా లేకపోవడం, పోషకాహార లోపం లేదా ఒత్తిడి వల్ల ఇలా రోజంతా యాక్టీవ్‌గా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఉదయం బద్ధకం నుంచి బయటపడి రోజంతా యాక్టీవ్‌గా ఉండాలంలే మీరు రాత్రి చేసే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట సరైన నిద్ర ఉంటేనే ఉదయం యాక్టివ్‌గా ఉంటారని చెబుతున్నారు. మరి ఉదయం యాక్టివ్‌గా ఉండాలంటే రాత్రి చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం.
సరైన టైంలో భోజనం చేయడం
ఉదయం నీరసంగా ఉండకూడదంటే.. సరైన సమయంలో రాత్రి భోజనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి, పడుకోవడానికి రెండు నుంచి మూడు గంటల ముందే మీరు మీ భోజనాన్ని పూర్తి చేసుకోండి. దీనివల్ల మీరు పడుకునే సమయానికి మీ ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సజావుగా జరిగితే, నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల మీరు మరుసటి రోజూ యాక్టీవ్‌గా ఉంటారు.
రాత్రి మంచి ఆహారం తీసుకోవడం
రాత్రి కారంగా, లేదా జిడ్డుగా ఉండే ఆహారాన్ని తీసుకోకండి. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఇది కడుపులో బరువు పెరగడానికి దారితీస్తుంది. మీ నిద్రకు కూడా భంగం కలిగిస్తుంది. కాబట్టి, రాత్రి భోజనంలో పోషకమైన, తక్కువ నూనె కలిగిన ఆహారం తీసుకోండి.
తిన్న వెంటనే పడుకోవడం
చాలా మంది తిన్న వెంటనే పడుకుంటారు. ఇలా చేస్తే భోజనం సరిగ్గా అరగదు. దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత కనీసం 10 నుండి 15 నిమిషాలు నడవండి. ఇలా చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో మీరు సరిగ్గా నిద్రపోయి, ఉదయాన్నే ఫ్రెష్‌గా నిద్రలేస్తారు.
నైట్ స్క్రీన్ చూడడం
చాలా మంది ఎక్కువ సేపు ఫోన్ చూస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. మంచి నిద్ర కోసం, పడుకునే ముందు మీ స్క్రీన్ సమయాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. రాత్రిపూట స్క్రీన్‌లను చూడటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నిద్రకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి రాత్రిపూట స్క్రీన్ టైం తగ్గిస్తే ఉదయం ఉత్సాహంగా ఉంటారు.
కనీసం 8 గంటల నిద్ర
చాలా మంది రాత్రి ఆలస్యంగా నిద్రపోతుంటారు. ఇది నిద్రను డ్యామేజ్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే మీరు రోజంతా యాక్టీవ్‌గా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పై చిట్కాలు పాటించడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉంటారు.


