Friday, November 22, 2024
Homeహెల్త్Health tips: సన్నగా ఉన్నవాళ్లు లావు కావాలంటే?

Health tips: సన్నగా ఉన్నవాళ్లు లావు కావాలంటే?

సన్నగా ఉన్నవాళ్లు బరువు పెరగాలంటే రాత్రి నిద్రపోయే ముందు అరకప్పు ఖర్జూరం పళ్లు తిని, గ్లాసుడు పాలు తాగాలి. ఇలా చేస్తే శరీరానికి కావలసిన శక్తి కూడా వస్తుంది.
రోజుకు ఐదు వాల్‌ నట్స్‌ తింటే బిపి నియంత్రణలో ఉంటుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరానికి కావాలసిన ఫైబర్‌, పొటాషియం, సోడియం, ఇతర పోషకాలను అందిస్తుంది.
డయాబెటిస్‌ని దాల్చిన చెక్క నియంత్రణలో ఉంచుతుంది.ఇన్ఫెక్షన్లతో పోరాడే సుగుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. నెలసరి నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలోని హార్మోన్లలో హెచ్చుతగ్గులను నివారిస్తుంది. దాల్చిన చెక్క పొడి యాంటి ఏజింగ్‌ గా చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
పుట్టగొడుగులను బ్రేక్‌ ఫాస్ట్‌ గా తీసుకుంటే ఆకలి తక్కువగా ఉండి కడుపునిండినట్టు ఉంటుంది. పుట్టగొడుగులు, మాంసాహారం రెంటిలో ప్రొటీన్లు సమస్థాయిలో ఉంటాయిట.
వంటల్లో కొబ్బరినూనె వాడకం ఎంతో మంచిది. దీనితో చేసిన వంటలు తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మెంతుల పొడి కలుపుకొని రోజూ ఉదయం, సాయంత్రం తాగితే కడుపునిండినట్టు ఉండి తొందరగా ఆకలి వేయదు.శరీరంలోని ముఖ్యంగా కాలెయం చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.
ఎత్తు పెరిగేలా చేయడంలో గుడ్డు బాగా పనిచేస్తుంది. ఇందులో అనేక విటమిన్లు, కాల్షియం ఉంటాయి కాబట్టి పొడుగు పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News