Health Tips of Clove It Will Help You Lose Weight And Beauty Enhance: లవంగం మన భారతీయ వంటకాల్లో వివరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం. ఇది కేవలం ఆహారానికి రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా, దీనిలోని ఔషధ గుణాలు శరీరాన్ని బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక్క లవంగాన్ని నోటిలో ఉంచుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలకు సులభమైన నివారణగా పనిచేస్తుంది. లవంగం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే యూజెనాల్ అనే సమ్మేళనం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు లవంగాన్ని నోటిలో ఉంచుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా అనేక సమస్యలు దూరమవుతాయి.
లవంగంతో ప్రయోజనాలు ఇవే..
నోటి దుర్వాసన మటుమాయం
రాత్రంతా లవంగం లాలాజలంలో కరిగి నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది దుర్వాసనను పూర్తిగా తొలగించి.. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా దీన్ని వంటకాల్లో ఉపయోగించడం వల్ల నోరు శుభ్రంగా, ఇన్‌ఫెక్షన్లు లేకుండా తయారవుతుంది.
దంతాల నొప్పికి ఉపశమనం
దంతాల నొప్పి, చిగుళ్ల వాపు నుంచి లవంగం సహజంగా ఉపశమనం కలిగిస్తుంది. దానిలోని తేలికపాటి అనస్థీటిక్ ప్రభావం నొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్లను బలపరుస్తుంది. తరచుగా పంటి నొప్పి వచ్చే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
దగ్గు-గొంతు నొప్పికి ఉపశమనం
రాత్రిపూట గొంతు నొప్పి లేదా పొడి దగ్గుతో బాధపడుతుంటే.. లవంగం ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని వెచ్చని గుణం గొంతుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కఫాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
లవంగాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రి లవంగాన్ని చప్పరించడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా తయారై.. ఉదయం కడుపు తేలికగా అనిపిస్తుంది. ఇది శరీరానికి డిటాక్సిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది
లవంగంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా లవంగం తీసుకోవడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్లు, వైరల్ వ్యాధుల నుంచి బయటపడొచ్చు. చలికాలంలో లవంగం తీసుకోవడం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బాడీలో ఇమ్యూనిటీని పెంచుతాయి. దీంతో పాటు యూజెనాల్ అనే కాంపౌండ్ కారణంగా పెయిన్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. లవంగాన్ని తీసుకోవడం వల్ల ఎంజైమ్స్ స్టిమ్యూలేట్ అయి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీనిలోని గుణాలు ఓరల్ హైజీన్‌ని కాపాడుతుంది. ఈ లవంగాలు ఎముకలు, లివర్ హెల్త్‌ని కాపాడతాయి. అంతేకాకుండా, బ్లడ్ షుగర్‌ని రెగ్యులేట్ చేస్తాయి. స్కిన్, హెయిర్‌ని కూడా ఆరోగ్యంగా చేస్తాయి.


