Sunday, February 8, 2026
Homeహెల్త్Diabetes: భారత్‌లో పెరుగుతున్న ‘డయాబెటిస్‌’.. టైప్‌- 2 ముప్పు తప్పాలంటే ఈ టిప్స్‌ తప్పనిసరి.!

Diabetes: భారత్‌లో పెరుగుతున్న ‘డయాబెటిస్‌’.. టైప్‌- 2 ముప్పు తప్పాలంటే ఈ టిప్స్‌ తప్పనిసరి.!

Type- 2 Diabetes: భారత్‌లో డయాబెటిస్‌ ముప్పు రోజురోజుకీ పెరుగుతోంది. 2024లో 148 మిలియన్ల చక్కెర రోగులతో చైనా మొదటి స్థానంలో ఉండగా.. 90 మిలియన్ల రోగులతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. షుగర్‌ వ్యాధిని నియంత్రించకపోతే.. మూత్రపిండాల నష్టం, న్యూరోపతి, రెటినోపతి, గుండె జబ్బుల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ మీరు ప్రీ- డయాబెటిక్‌ కండిషన్‌లో ఉన్నట్లయితే.. టైప్‌- 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.. 

- Advertisement -
  1. చక్కెర లేని పానీయాలు

చక్కెర అధికంగా ఉండే ఫిజీ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, పండ్ల రసాలు, స్మూతీలు టైప్- 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. అప్పటికే శరీరంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటంతో.. ఈ షుగర్‌ డ్రింక్స్‌ తీసుకోవడం ద్వారా లెవెల్స్‌ పెరిగి బరువు పెరిగే ఛాన్స్‌ ఉంది. వీటికి బదులుగా తాగు నీరు, చక్కెర లేకుండా పాలు, టీ, కాఫీలు తీసుకోవాలి. 

  1. అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్లు

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర పెరుగుదలను వేగవంతం చేస్తాయి. వీటికి బదులుగా బ్రౌన్ రైస్, హోల్‌వీట్ పాస్తా, ఓట్స్, హోల్‌మీల్ బ్రెడ్ వంటి హోల్‌గ్రెయిన్‌లను ఎంచుకోవడం ఉత్తమం. వీటిలో గ్లూకోజ్ పెరుగుదలను నిరోధించే అధిక ఫైబర్ ఉంటుంది. వీటితో పాటు చిక్‌పీస్, బీన్స్, పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అధిక ఫైబర్ ఆహారాలు.. ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

Also Read: https://teluguprabha.net/health-fitness/health-benefits-of-drinking-raisin-water-every-morning/

  1. ప్రాసెస్ చేసిన మాంసాలు

ఎర్ర మాంసాలు, బేకన్, హామ్, సాసేజ్‌లు వంటి ప్రాసెస్ చేసినవి టైప్- 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి గుండె సమస్యలు, క్యాన్సర్‌లకు కూడా కారణమవుతాయి. ప్రోటీన్‌కు బదులుగా పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు, చికెన్, టర్కీ, ఉప్పు లేని గింజలను తీసుకోవాలి. సాల్మన్ లేదా మాకేరెల్ వంటి చేపల్లో గుండెను రక్షించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లం అధికంగా ఉండటం కారణంగా వారానికి ఓ సారైనా తీసుకోవడం మంచింది. 

  1. పండ్లు, కూరగాయలు

ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు చేర్చుకోవడం వల్ల టైప్- 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. ఆపిల్, ద్రాక్ష, బెర్రీలు, పాలకూర, కాలే, వాటర్‌క్రెస్ వంటి ఆకుకూరలు ప్రయోజనకరంగా ఉంటాయి. తియ్యని పెరుగు, చీజ్ వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులు టైప్- 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆల్కహాల్‌ను అధికంగా తీసుకుంటే కేలరీలు పెరిగి టైప్- 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Also Read: https://teluguprabha.net/health-fitness/who-should-avoid-brinjal-and-why-it-may-not-suit-everyone/

  1. పోషకాలు అధికంగా ఉండే స్నాక్స్

క్రిస్ప్స్, బిస్కెట్లు, స్వీట్లు, తీపి చాక్లెట్లు.. టైప్‌- 2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని పెంచుతాయి. బరువు పెరగడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. వీటికి బదులుగా, తియ్యని పెరుగులు, ఉప్పు లేని గింజలు, విత్తనాలు, పండ్లు లేదా కూరగాయలను తీసుకోవడం ఉత్తమం. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News