Sunday, July 7, 2024
Homeహెల్త్Healthy shot: ఈ షాట్ తాగితే చర్మం పట్టులా, జుట్టు సిల్కీగా..

Healthy shot: ఈ షాట్ తాగితే చర్మం పట్టులా, జుట్టు సిల్కీగా..

ఈ షాట్ లోని చుక్క చుక్కా ఆరోగ్యకరమైందే

శరీరం ఆరోగ్యంగా ఉండాలి…వెంట్రుకలు, చర్మం అందాలు చిందించాలి అని అందరు అమ్మాయిలూ కోరుకుంటారు. మరి ఈ మూడూ ఆరోగ్యంగా ఉండడమంటే అంత సింపుల్ గా సాధ్యమయ్యే విషయం కాదు. అయితే ఇవన్నీ ఇచ్చే యాంటి ఇన్ఫ్లమేటరీ షాట్ ఒకటి ఉంది. ఈ చిన్న పంచ్ షాట్ లో విటమిన్లు, యాంటాక్సిండెల్లతో పాటు బోలెడు పోషకాలు సైతం ఉన్నాయి. ఎంతో రుచిగా ఉండే ఈ షాట్ చర్మానికి, జుట్టుకు, శరీరానికి చేసే మేలెంతో.

- Advertisement -

ఈ షాట్ నిమ్మరసం, అల్లం, పసుపు, ఆరంజ్, మిరియాల పొడుల మిశ్రమం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది వెల్నెస్ షాట్ కూడా. నేహా పరిహార్ అనే పోషకాహారనిపుణురాలు ఈ షాట్ నిత్యం తీసుకుంటే ఎంతోమంచిదంటున్నారు. ఎన్నో పోషకవిలువలతో నిండివుండే ఈ వెల్నెస్ లేదా డిటాక్స్ లేదా ఇమ్యూనిటీ లేదా బూస్టర్ షాట్ పరిమాణంలో చిన్నదే కానీ ఈ పంచ్ షాట్ అందించే ప్రయోజనాలు మాత్రం కొండంత. ఇందులోవాడే నిమ్మ, అల్లంల నుంచి వచ్చే సువాసనలు ఎంతో. అంతేకాదు వీటిల్లో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలం. నిమ్మలో విటమిన్ సి నిండుగా ఉండి చర్మానికి అందించే అందం, ఆరోగ్యం, సాంత్వన ఎంతో. ఇక అల్లంలో యాంటి ఇన్ఫ్లమేటరీగుణాలతో పాటు బోలెడు యాంటాక్సిడెంట్లు ఉండి అవి జీర్ణక్రియకు చేసే ఉపకారం ఎంతో. ఇందులో వాడే పసుపు ఈ షాట్ కే
ప్రత్యేకం. పసుపు సహజసిద్ధమైన యాంటిఇన్ఫ్లమేటరీ గుణాల సంపద. ఇందులోని కుర్కిక్యుమిన్ శరీరానికి సహజసిద్ధమైన యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలను అందిస్తుంది.

ఈ ఇన్ఫ్లమేటరీ షాట్ కు పసుపు ఎంతో ప్రత్యేకం కూడా. దీనికి సిట్రస్ స్వీట్నెస్ చేర్చడం వల్ల విటమిన్ సితో పాటు యాంటాక్సిడెంట్ల పవర్హౌస్ గా ఈ షాట్ తయారవుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా ఈ సిట్రస్ (ఆరంజ్) తోడ్పడుతుంది. దీంతో చర్మం యంగ్ గా, ఆరోగ్యంగా ఉండి కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ షాట్ లో కలిపి చిటికెడు మిరియాల పొడి పవర్ కూడా తక్కువేం కాదు. ఇందులో పైపరైన్ ఉంటుంది. ఇది పసుపులోని కుర్క్యుమిన్ ని గ్రహించి దాని లాభాలన్నింటినీ శరీరానికి అందేలా చేస్తుంది. ఇంతకూ ఈ షాట్ ఎలా చేయాలంటారా? అది చాలా సింపుల్. నిమ్మ, అల్లం,ఆరంజ్, పసుపు, మిరియాల పొడిని రెడీ పెట్టుకోవాలి. వీటన్నింటినీ బ్లెండర్ లో వేసి బాగా కొట్టాలి. ఆతర్వాత ఆ జ్యూసును వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం పిండి తాగాలి. అంతే.

ఇందులో కేవలం 25 కాలరీలు మాత్రమే ఉంటాయి. మరి ఎన్నో న్యూట్రియంట్లతో నిండిన ఈ ఇన్ఫ్లమేటరీ షాట్ తో మనం పొందే ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. దీంతో చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. నిమ్మ, కమలాపండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో పాటు పసుపులోని యాంటి ఇన్ఫ్లమేటరీ సుగుణాల వల్ల చర్మం పట్టులా తయారవుతుంది. ఇవి ఇన్ఫ్లమేషన్ పై
పోరాడడమే కాకుండా చర్మంపై ఏర్పడే దద్దుర్లు తగ్గిస్తుంది. అంతేకాదు చర్మాన్ని ఎంతో కాంతివంతం చేస్తుంది. స్కిన్ డల్ గా ఉండకుండా సహజసిద్ధమైన కాంతిని పొంది మెరుపులు చిందిస్తుంది. ఈ షాట్ లో
ఉన్న యాంటాక్సిడెంట్లు మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ షాట్ లోని యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యవంతమైన శిరోజాల పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ బూస్టర్ షాట్ తో జుట్టు సైతం ఎంతో చిక్కగా, దృఢంగా ఉంటుంది.ఈ వెల్నెస్ షాట్ శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. మిమ్మల్ని బాగా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News