Vitamin deficiency: చాలామంది గుండెపోటు కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా మధుమేహంతో వస్తుందని అనుకుంటారు. కానీ, విటమిన్ డి లోపం కూడా గుండెపోటుకు ప్రధాన కారణమని తెలుసా? శరీరంలో ఈ విటమిన్ లోపం ఉంటె అది గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ డి
విటమిన్ డి ని “సూర్యరశ్మి విటమిన్” అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో కాల్షియం, భాస్వరం సమతుల్యం చేస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. అయితే, దీని లోపం గుండెను ప్రభావితం చేస్తుంది. విటమిన్ డి లోపం బాధపడుతున్నవాకి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read: Ileana D’Cruz : మాతృత్వంలో నరకం చూశా! – ఇలియానా
విటమిన్ డి లోపం-గుండెపోటు మధ్య సంబంధం ఏమిటి?
శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు, రక్తపోటు అసమతుల్యమవుతుంది. ధమనులు వాపు ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితి క్రమంగా హృదయ సంబంధ వ్యాధులకు దారి తీస్తుంది.
1. రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది
2. గుండె పంపింగ్ సామర్థ్యం బలహీనపడుతుంది
3. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది
విటమిన్ డి లోపం లక్షణాలు
1. నిరంతర అలసటగా అనిపిస్తుంది
2. ఎముకలు, కండరాలలో నొప్పిగా ఉంటుంది
3. తరచుగా అనారోగ్యానికి గురవుతారు
4. నిద్ర సమస్యలు
5. నిరాశ లేదా మానసిక స్థితిలో మార్పులు
విటమిన్ డి లోపాన్ని ఎలా అధిగమించాలి?
1. ప్రతిరోజూ ఉదయం సూర్యకాంతిలో అరగంట గడపాలి
2. పాలు, పెరుగు, గుడ్లు, పుట్టగొడుగులు, కొవ్వు చేపలను ఆహారంలో చేర్చుకోవాలి
3. వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి
కేవలం రక్తపోటు, శరీరంలో చక్కెర స్థాయిలును నియంత్రించడం గుండెను ఆరోగ్యంగా ఉంచదు. విటమిన్ డి లోపం కూడా గుండెపోటుకు కారణం అవుతుంది. గుండెపోటును నివారించడానికి, ఎప్పటికప్పుడు విటమిన్ డి స్థాయి పరీక్ష చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఈ లోపం కనిపిస్తే, వెంటనే చికిత్స తీసుకోవడం ప్రారంభించాలి. అలాగే, దినచర్యలో సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


