Heart health foods: ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఆహారాలు గుండె పనితీరును పెంచడంలో, కిడ్నీలు సరైన విధంగా పనిచేయడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో తగిన పోషకాలు ఉన్న ఫుడ్స్‌ను చేర్చుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండటంతో పాటు కండరాల పనితీరు కూడా మెరుగవుతుందని సూచిస్తున్నారు. అందుకే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండబెట్టిన జర్దాలు, పప్పులు
ఎండబెట్టిన జర్దాలు ఈ జాబితాలో ముఖ్యమైనవి. అర కప్ ఎండబెట్టిన జర్దాల్లో సుమారు 755 మిల్లీగ్రామ్స్ పోషకాలు ఉంటాయి. ఇవి ఫైబర్, విటమిన్ A, యాంటీఆక్సిడెంట్స్ కూడా తగినంతగా అందిస్తాయి. స్నాక్‌గా తినవచ్చు, పెరుగు లేదా సలాడ్స్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. అదే విధంగా పప్పులు కూడా మంచి పోషక విలువలు కలిగిన ఆహారం. ఒక కప్ ఉడికించిన పప్పుల్లో సుమారు 731 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. ఇవి ఫైబర్, ప్రోటీన్ కూడా అందిస్తాయి.
పాలకూర, ఎండబెట్టిన ఆలుబుఖారా
పాలకూర ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే ఆకుకూర. ఒక కప్ ఉడికించిన పాలకూరలో సుమారు 839 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి మరింత మేలు చేస్తుంది. కూరగా, గ్రేవీగా లేదా స్మూతీగా తీసుకోవచ్చు. అలాగే ఎండబెట్టిన ఆలుబుఖారా కూడా పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం. ఒక కప్ ఎండబెట్టిన ఆలుబుఖారాలో సుమారు 635 నుంచి 698 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. ఇవి ఫైబర్, విటమిన్ K, యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి.
Read Also: Ayodhya Tour: అయోధ్యతో పాటు కాశీ, పూరి క్షేత్రాల సందర్శన.. పూర్తి వివరాలివే..
ఆలుగడ్డలు, అరటిపండ్లు
ఆలుగడ్డలు కూడా పోషకాలు కలిగిన సాధారణ ఆహారం. స్కిన్‌తో కలిపి ఒక మీడియం బేక్డ్ ఆలుగడ్డలో సుమారు 926 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్ C కూడా లభిస్తాయి. అయితే వీటిని మితంగా తీసుకోవడం మంచిది. ఇక అరటిపండ్లు కూడా చాలా మందికి ఇష్టమైన పండు. ఒక మీడియం అరటిపండులో సుమారు 422 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇవి తక్షణ ఎనర్జీ ఇవ్వడంలో కూడా సహాయపడతాయి.
రాజ్మా పప్పు, కిస్మిస్
రాజ్మా పప్పు కూడా మంచి పోషకాలు కలిగిన ఆహారం. అర కప్ ఉడికించిన రాజ్మా పప్పులో సుమారు 359 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. వీటిని సూప్స్, సలాడ్స్, స్ట్యూస్‌లలో ఉపయోగించవచ్చు. అలాగే కిస్మిస్ కూడా మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. అర కప్ కిస్మిస్‌లో సుమారు 600 నుంచి 750 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. ఇవి సహజమైన తీపి రుచి కలిగి ఉండటం వల్ల స్నాక్‌గా తినవచ్చు.
సోయాబీన్స్, పెరుగు
సోయాబీన్స్ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారం. అర కప్ సోయాబీన్స్‌లో సుమారు 443 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే పెరుగు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సుమారు 6 ఔన్స్ పెరుగులో 398 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. అదనంగా కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ కూడా అందుతాయి. ఈ విధంగా ఈ ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కిడ్నీల పనితీరు కూడా మెరుగవుతుంది.

