Lemon Peel Benefits: సాధారణంగా మనం నిమ్మకాయను వాడిన తర్వాత తొక్కను పడేస్తుంటాం. కానీ, దాని తొక్క కూడా ఆరోగ్యానికి మంచిదనే విషయం మీకు తెలుసా? అవును, నిమ్మ తొక్కలో లెక్కలేనన్ని ఔషధ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని పుల్లటి రుచి కోసం వివిధ రకాల వంటకాల్లో వాడుతుంటారు. నిమ్మకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, దాని తొక్కతో కూడా అన్నే ఉపయోగాలున్నాయి.
నిమ్మ తొక్కలలో విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఈ తొక్కలు శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరచడంలో, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో, చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇప్పుడు నిమ్మకాయ తొక్కతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి: నిమ్మ తొక్కలలోని విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. సాధారణ జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.
కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది: తొక్కలలోని పాలీఫెనాల్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
also read:One Plus 15 Launched: 7300mAh బిగ్ బ్యాటరీతో వన్ ప్లస్ 15 వచ్చేసిందోచ్..త్వరలో భారత్‌కు!
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: వీటిలో లభించే ఆహార ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
నోటి ఆరోగ్యం: నిమ్మ తొక్కలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి దుర్వాసన, చిగుళ్ల వాపును తగ్గిస్తాయి.
ఎముకలను బలోపేతం చేస్తాయి: నిమ్మకాయ తొక్క కాల్షియం, విటమిన్ సి మంచి మూలం. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆస్టియోపోరోసిస్‌ను సైతం నివారిస్తుంది.
బరువు తగ్గడం: నిమ్మ తొక్కలలో లభించే ‘పెక్టిన్’ అనే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది: నిమ్మ తొక్కలలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. అంతేకాదు.. మచ్చలును తొలగించి, యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
లివర్ ఆరోగ్యం: నిమ్మ తొక్కలు శరీరం నుండి విషాన్ని తొలగించి కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి.
క్యాన్సర్ రక్షణ: వాటిలో ఉండే డి-లిమోనీన్ అనే మూలకం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా చర్మం, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


