Herbal Teas-Help in Weight Loss:బరువు తగ్గాలని నిర్ణయించుకున్నవారు మొదటగా ఆలోచించేది డైట్ గురించి. రుచికరమైన ఆహారం వదిలేయాలి, తినే పదార్థాలు తగ్గించుకోవాలి అనే ఆలోచన చాలా మందికి భారంగా అనిపిస్తుంది. అందుకే డైట్ అనగానే శిక్ష అనిపించినట్లు భావిస్తారు. కానీ, ప్రతిదీ కష్టంగానే అనుకోవాల్సిన అవసరం లేదు. తినే ఆహారం, తాగే పానీయాల్లో చిన్న మార్పులు చేసుకుంటే బరువు తగ్గడం సులభమవుతుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన హెర్బల్ టీలు శరీరానికి సహజసిద్ధంగా ఫ్యాట్ బర్న్ చేయడంలో సహాయం చేస్తాయి.
టీ అంటే చాలా మందికి..
టీ అంటే చాలా మందికి ఇష్టం. సాధారణంగా టీ తాగితే బరువు పెరుగుతుందని అనుకుంటారు. కానీ, కొన్ని ప్రత్యేకమైన హెర్బల్ టీలు మాత్రం విరుద్ధ ఫలితం ఇస్తాయి. వీటిలో ఉండే ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో కొవ్వును తగ్గించి జీవక్రియ వేగాన్ని పెంచుతాయి. వీటిని తీసుకుంటే కేలరీలు పెరుగుతాయేమో అన్న భయం ఉండదు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ హెర్బల్ టీలు బరువు తగ్గడంలో సహజమైన మార్గంగా ఉపయోగపడతాయి.
Also Read: https://teluguprabha.net/devotional-news/navratri-day-three-annapurna-devi-significance-explained/
కాటెచిన్స్..`
బరువు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషించే పదార్థం కాటెచిన్స్. ఇవి ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్. టీ ఆకుల్లో ప్రత్యేకంగా నాలుగు రకాల కాటెచిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్యాట్ కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అంతేకాకుండా మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇప్పుడు బరువు తగ్గడంలో సహాయపడే ముఖ్యమైన హెర్బల్ టీలు ఏవో చూద్దాం.
ఊలాంగ్ టీ
ఊలాంగ్ టీ అనేది పాలీ ఫెనాల్స్‌తో నిండిపోయి ఉంటుంది. ఇందులో కెఫిన్ కూడా ఉంటుంది. ఇవి రెండూ కలిసి శరీరంలో ఫ్యాట్ బర్న్ వేగాన్ని పెంచుతాయి. ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్న భోజనం సమయంలో ఊలాంగ్ టీ తాగితే శరీరం త్వరగా కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది. ఈ టీని ప్రతిరోజూ అలవాటుగా చేసుకుంటే కొద్ది కాలంలో బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.
బ్లాక్ టీ
బ్లాక్ టీ ఆకులు ఇతర టీ ఆకులకన్నా ఎక్కువగా ఆక్సీకరణకు లోనవుతాయి. దీని వలన పాలీఫెనాల్స్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఈ పాలీఫెనాల్స్ శరీరానికి కేలరీలు ఎక్కువగా చేరకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా కొవ్వు, కార్బోహైడ్రేట్స్ శోషణను తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం రోజుకు మూడు కప్పుల బ్లాక్ టీ తాగే వారు తాగని వారితో పోలిస్తే స్పష్టంగా బరువు తగ్గినట్లు తేలింది. ఈ టీ బెల్లీ ఫ్యాట్‌ను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ తేలికగా చేదుగా ఉండే పానీయం. దీన్ని తరచుగా తీసుకునే వారు శరీరంలో కడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడమే కాకుండా మొత్తం బరువుని కూడా తగ్గించుకోవచ్చు. దీంట్లో ఉండే EGCG అనే యాంటీ ఆక్సిడెంట్ మరియు కెఫిన్ కలిసి కొవ్వు కణాలను వేగంగా విచ్ఛిన్నం చేస్తాయి. ఒక అధ్యయనంలో 10 సంవత్సరాల పాటు రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగిన వారికి బెల్లీ ఫ్యాట్ తగ్గినట్లు తేలింది. అలాగే EGCGని సప్లిమెంట్స్ రూపంలో మూడు రోజులు తీసుకున్న వారిలో ఫ్యాట్ ఆక్సిడేషన్ పెరిగిందని గుర్తించారు. కాబట్టి గ్రీన్ టీ బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
Also Read: https://teluguprabha.net/devotional-news/hidden-meaning-of-spider-under-durga-forehead-dot/
అల్లం టీ
అల్లం టీని ఎక్కువగా దగ్గు, జలుబు తగ్గించుకోవడానికి వాడుతారు. కానీ ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఆకలిని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల అనవసరంగా స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా రాత్రి భోజనం తర్వాత అల్లం టీ తాగితే కడుపు బరువుగా అనిపించడం తగ్గుతుంది. దీన్ని తయారు చేయడానికి ఒకటిన్నర కప్పు నీటిలో ఒక అంగుళం అల్లం ముక్క వేసి ఐదు నిమిషాలు మరిగించి, అవసరమైతే నిమ్మరసం కలిపి తాగాలి.


