Monday, February 16, 2026
Homeహెల్త్Hearing Loss: డయాబెటిస్‌, హై బీపీతో వినికిడి శక్తి లోపిస్తుందా.?

Hearing Loss: డయాబెటిస్‌, హై బీపీతో వినికిడి శక్తి లోపిస్తుందా.?

Hearing Loss Causes: అధిక రక్తపోటు, మధుమేహం రెండూ ప్రమాదకరమైన వ్యాధులే. వీటి కారణంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. కానీ వీటి కారణంగా వినికిడి శక్తి కూడా లోపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

మీరు డయాబెటిస్ లేదా అధిక రక్తపోటును కలిగి ఉన్నట్లయితే.. మీకు గుండె, మూత్రపిండాలు, కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొంతమందిలో డయాబెటిస్, హై బీపీ వినికిడి శక్తిని కూడా దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఇది ప్రభావం చూపిస్తుందట. ఈ రెండు వ్యాధులు కొన్ని సందర్భాల్లో వినికిడి లోపానికి కారణమవుతాయని డాక్టర్లు వివరిస్తున్నారు. ఈ వ్యాధులతో బాధపడుతున్న కొంతమంది రోగులు వినికిడి లోపం గురించి కూడా ఫిర్యాదు చేస్తారని.. చెబుతున్నారు.

Also Read: https://teluguprabha.net/national-news/supreme-court-reserves-judgment-bihar-sir-eci-citizenship-powers/

ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. డయాబెటిస్ ఉన్న రోగుల్లో చక్కెర స్థాయిలు దీర్ఘకాలికంగా అధికంగా ఉంటే, వారి శరీరంలోని నరాలు దెబ్బతింటాయి. చెవి లోపల ఉన్న శ్రవణ నాడి కూడా ప్రభావితమవుతుంది. అధిక చక్కెర స్థాయిలు ఈ నరాల్లో వాపునకు కారణమవుతాయి. ఇది డయాబెటిస్ ఉన్న రోగుల్లో వినికిడి లోపానికి దారితీస్తుంది. అయితే, ఈ సమస్య ప్రతి డయాబెటిస్ రోగిలో కనిపించదు. ఇది వృద్ధుల్లో చాలా కాలంగా డయాబెటిస్ ఉన్నవారిలో మాత్రమే సంభవిస్తుంది.

అధిక రక్తపోటు ఉన్నవారిలోలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది. కానీ రక్తపోటు నియంత్రణలో లేకపోయినా, అకస్మాత్తుగా పెరిగినా.. అది వినికిడి లోపానికి దారితీస్తుంది. దీనినే ఆకస్మిక వినికిడి లోపం అంటారు. అయితే అలాంటి సందర్భాలు చాలా అరుదు. కానీ ఒక వ్యక్తికి మధుమేహం, అధిక రక్తపోటు రెండూ ఉంటే, వారి ప్రమాదం మరింతగా పెరుగుతుంది.

Also Read: https://teluguprabha.net/national-news/economic-survey-critical-minerals-strategic-choke-points-energy-transition/

మధుమేహం, హై బీపీ సమస్యలు ఉన్నవారు ఈ లక్షణాలు విస్మరించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకరితో ఒకరు సంభాషించుకోవడంలో ఇబ్బంది పడినా.. ఫోన్‌లో అవతలి వ్యక్తి మాటలు స్పష్టంగా అర్థం కాకపోయినా వైద్యుడిని సంప్రదించాలి. చెవుల్లో ఈలల శబ్దం,  ఫోన్‌ మాట్లాడాలంటే వాల్యూమ్‌ పెంచడం లాంటి లక్షణాలు కనిపించినట్లయితే.. ENT వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. ప్రారంభ దశలో వినికిడి తరచుగా మందులు, చికిత్సతో మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News