తల నుంచి కాలి బొటన వేలి వరకూ ఆరోగ్యంగా, అందంగా ఉంచే నూనెలు కొన్ని ఉన్నాయి. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాటిల్లో ఒకటి గ్రీన్ టీ ఆయిల్. గ్రీన్ టీ ఆకులు, ఆలివ్ ఆయిల్ ని కలిపి ఒక జార్ లో పోసి బాగా పొడిగా, చల్లగా ఉన్న ప్రదేశంలో ఒక నెలపాటు ఉంచాలి. ఈ ఆయిల్ జట్టుకు కావలసిన మాయిశ్చరైజర్ని అందిస్తుంది. పొడిబారినట్టు ఉన్న వెంట్రుకలను మ్రుదువుగా చేస్తుంది. శిరోజాలు పెరిగేలా చేస్తుంది. దెబ్బతిన్న వెంట్రుకలను బాగుచేస్తుంది. అంతేకాదు పొడి చర్మాన్ని మ్రుదువుగా చేస్తుంది. వీటితో పాటు చర్మానికి ఆరోగ్యమైన మెరుపును అందిస్తుంది.
ఇంకొకటి పసుపు ఆయిల్. కొబ్బరి నూనెలో పసుపు పేస్టును కలిపి చిన్న మంటపై దాన్ని మరిగించాలి. తర్వాత చల్లార్చాలి. ఈ ఆయిల్ చర్మాన్ని కాంతివంతం చేతుంది. యాక్నే, మచ్చలు, గీతలు, మొటిమల సమస్యలపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు పెదవులు యంగ్ లుక్స్ తో మెరిచేలా ఈ నూనె చేస్తుంది. క్యారెట్ ఆయిల్ ఇంకొకటి. మీరు నిత్యం వాడే నూనెలో క్యారెట్ తురుము వేసి తక్కువ మంటలో ఆ నూనె రంగు మారే దాకా ఉడికించాలి. ఈ నూనె శిరోజాలను బాగా పెరిగేలా చేస్తుంది. వెంట్రుకలు, మాడులను ఉత్తేజితం చేస్తుంది. జుట్టు నల్లగా నిగ నిగలాడుతుంది. దెబ్బతిన్న చర్మాన్ని బాగుచేయడమే కాకుండా అది యంగ్ గా కనిపించేలా క్యారెట్ నూనె చేస్తుంది. మనం తయారు చేసుకోగలిగే ఇంకొక రకం నూనె కాఫీ ఆయిల్.
ఒక ప్యాన్ తీసుకుని అందులో కాఫీ, నిత్యం మీరు వాడే నూనె వేసి సన్నని మంటపై బాగా మరగనిస్తే చిక్కటి కాఫీ నూనె తయారవుతుంది. కాఫీ నూనె శిరోజాలను ఆరోగ్యకరమైన రీతిలో పెరిగేట్టు చేస్తుంది. వెంట్రుకలు నల్లగా నిగ నిగలాడేట్టు చేస్తుంది. అంతేకాదు జుట్టు రాలకుండా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది కూడా. పొడిబారిన జుట్టుకు తగినంత తేమను అందిస్తుంది. నల్లటి వలయాలు, మచ్చలు, స్ట్రెచ్ మార్కులను పోగొడుతుంది.
అవిస గింజల నూనె కూడా జుట్టు, చర్మానికి ఎంతో మంచిది. అవిస గింజల్లో గోరువెచ్చటి కొబ్బరినూనె పోసి బాగా కలపాలి. ఈ నూనె జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు పెరిగేట్టు చేస్తుంది. అంతేకాదు వెంట్రుకలను ద్రుఢంగా ఉంచుతుంది. జుట్టు పొడిబారినట్టు, పీచులా ఉండకుండా సంరక్షిస్తుంది. పొడి చర్మానికి కావలసిన హైడ్రేషన్ ను ఈ నూనె అందిస్తుంది. అంతేకాదు చర్మాన్ని బిగువుగా, మ్రుదువుగా ఉంచుతుంది కూడా. రోజ్ ఆయిల్ వెంట్రుకలకు, చర్మానికి చేసే మంచి ఎంతో. జజోబా ఆయిల్ జార్ లో రోజా పూవుల రెక్కలు వేసి ఆ జార్ ను వేడి నీళ్లల్లో ఉంచాలి. ఇలా చేస్తే సెంటెడ్ వాసన వస్తుంది. ఈ ఆయిల్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. స్కిన్ టోన్ ను ఒకేలా ఉండేలా చేస్తుంది. చర్మంపై ఉండే మచ్చలు, గీతలను పోగొడుతుంది. సెల్యులైట్, స్ట్రెచ్ మార్కులను పోగొట్టి మ్రుదువుగా చేస్తుంది. పొడిబారిన జుట్టును, రేగిన జుట్టును మ్రుదువుగా నల్లగా నిగ నిగలాడేట్టు చేస్తుంది.
అలొవిరా ఆయిల్ చర్మం, వెంట్రుకల అందం, ఆరోగ్యాలను కాపాడుతుంది. ఒక సాస్ ప్యాన్ తీసుకుని అందులో అలొవిరా ఆకును వేసి దానికి కేరియర్ ఆయిల్ ను జోడించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై మరిగించాలి. అంతే అలొవిరా ఆయిల్ రెడీ. ఈ ఆయిల్ జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు ఎంతో అందంగా, మరింత ఆరోగ్యంగా ఉంటాయి. వెంట్రుకలు సిల్కులా మ్రదువుగా, నల్లగా నిగ నిగలాడతాయి. అంతేకాదు ఈ ఆయిల్ చర్మాన్ని మెరిపిస్తుంది. చర్మానికి కావాల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. అంతేకాదు అలొవిరా నూనె జుట్టును యూత్ ఫుల్ అందాలు చిందించేలా చేసే యాంటీఏజింగ్ ఆయిల్ కూడా.
చివరిగా కొబ్బరి నూనె. కొబ్బరి ముక్కలతో ఇంట్లోనే ఆర్గానిక్ కొబ్బరి నూనెను తయారు చేయొచ్చు. ఇది జీర్ణ్ర క్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర బరువు తగ్గిస్తుంది. చర్మం, వెంట్రుకలను పరిరక్షిస్తుంది. అంతేకాదు శిరోజాలను, చర్మాన్నిఆరోగ్యంగా, ద్రుఢంగా, మరింత అందంగా ఉండేలా చేస్తుంది.